october 2nd
-
పెద్దల పండుగకు.. ‘గాంధీ’ గండం
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ప్రతి ఏటా మహాలయ అమవాస్య రోజున పెద్దల పండుగ చేసుకుని శక్తికొద్దీ మాంసాహారాన్ని భుజించడం తరతరాల సంప్రదాయం. ఈసారి గాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీన ఈ పర్వదినం రావడంతో ఆటంకం ఏర్పడింది. పెద్దల పండుగ అంటేనే మద్యం, మాంసం ఉంటాయి. స్వర్గస్తులైన పెద్దలకు అవి రెండూ నైవేద్యంగా సమరి్పంచి ఆపై తాము పుచ్చుకొంటారు. కానీ గాంధీ జయంతి రోజున మద్యం షాపులు, మాంసాహార విక్రయాలు నిషేధిస్తారు. అనుమతికి డిమాండ్ ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మనవి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అనాదికాలంగా వస్తున్న సంప్రదాయానికి భంగపరచడం సబబు కాదని కొందరు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ల నేపథ్యంలో ఏం చేయాలా? అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. -
రైతు ఉద్యమం: టికాయత్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమం కొత్త రూపం తీసుకుంటోంది. ఎన్ని వేధింపులు.. అడ్డంకులు సృష్టించినా రైతులు వెనుతిరగడం లేదు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు, రైతు నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై జెండా ఎగురేయడంపై ఉద్యమం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శనివారం జాతీయ రహదారుల దిగ్బంధం (చక్కా జామ్) కార్యక్రమం చేపట్టగా దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అయితే తాము ఇప్పట్లో ఇళ్లకు వెళ్లమని.. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు అక్కడే కూర్చుంటామని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. చక్కా జామ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ రహదారి ఘాజీపూర్ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో భారత్ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ మాట్లాడారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో దురాక్రమణదారులు తమ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని చూశారని ఆరోపణలు చేశారు. ఈ రహదారుల దిగ్బంధం ఈరోజుతో ముగిసేది కాదని.. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని రాకేశ్ ప్రకటించారు. అప్పటివరకు రోడ్లపైనే వ్యవసాయం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా రైతుల ఈ పిలుపుతో ఉద్యమం తారస్థాయికి చేరనుంది. -
అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
సాక్షి, అమరావతి: అక్టోబర్ 2(గాంధీ జయంతి) రోజున 35షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్లను వేయడం, లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి పోటోలు తీయడం, రికార్డుల్లో దాన్ని నమోదు చేయడం, వెబ్ ల్యాండ్, ఆర్ఓఎఫ్ఆర్ డేటాబేస్‌లో ఈ వివరాలను నమోదు చేయడం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. (అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) అదే విధంగా అర్బన్ హెల్త్ క్లినిక్స్‌కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. కొత్తగా 16 టీచింగ్ ఆసుత్రులను నిర్మించబోతున్నామని తెలిపారు. వచ్చే నెలలో వీటికి టెండర్లు జరుగుతాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం పదకొండు టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయని, వాటికి కొత్తగా పదహారు కలిస్తే 27టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నాడు-నేడు: నాడు-నేడు స్కూల్స్‌కు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు కిచెన్ కూడా జత చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పది అంశాలకు సంబంధించి అక్టోబర్ 5న స్కూల్స్ తెరిచే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. నాడు-నేడు పనుల్లో క్వాలిటీపై కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. 1085 టాయిలెట్లపై స్లాబ్‌లు వేయాల్సి ఉందని వాటిని కూడా పూర్తి చేయాలని సూచించారు. 55,607 అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా నాడు-నేడు కింద వసతుల ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. వాటిని వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద మార్చబోతున్నామని సీఎం వెల్లడించారు. ఈ కేంద్రాల్లో కూడా పది అంశాల్లో అన్ని నాడు-నేడు పనులు చేపడతామని వ్యాఖ్యానించారు. 22979 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని వాటికి నూతన భవనాలను సమకూర్చాలన్నారు. 11,961 చోట్ల అంగన్వాడీలకు స్థలం గుర్తించడం జరిగిందని తెలిపారు. 12,018 చోట్ల స్థలం కేటాయించాల్సి ఉందని, కలెక్టర్లు, జేసీలు త్వరగా స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ నెల 30నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రైమరీ స్కూళ్లలో స్థలం అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 1200 నూతన భవనాలు పూర్తయ్యే స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మండల స్థాయిలో ఎంత అవసరం, ఎంత లభ్యత ఉంది అనే అంశాలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో ఎరువులకు అధిక డిమాండ్ ఉంటుందని కలెక్టర్లు దానిపై దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. -
మరపురాని బాపు గురుతులు
సందర్భం : నేడు గాంధీ జయంతి అనంతపురం కల్చరల్ : అహింస, శాంతి, సత్యాలకు ప్రతిరూపం మహాత్మాగాంధీ. గాంధీ స్ఫూర్తితో ఎంతో మంది జిల్లావాసులు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారతమాతను దాస్యశంఖలాల నుంచి విముక్తి చేయడానికి గాంధీ దేశమంతటా పర్యటిస్తూ అనంతపురం జిల్లాకు వచ్చారు. కల్లూరు సుబ్బారావులాంటి వ్యక్తుల సహకారంతో హిందూపురం, గుత్తి, తాడిపత్రి, పెద్దవడుగూరు లాంటి ప్రాంతాలు సందర్శించారు. మహాత్ముడి వెంట నడిచిన ఎంతోమంది జిల్లావాసులు నేటికీ ఆయన ఆశయాలు పాటిస్తున్నారు. నాటి గురుతులను ఇప్పటికీ మరువలేకపోతున్నారు. గాంధీజీ అంటే మా తండ్రికి ప్రాణం మేము చిన్నగా ఉన్నప్పుడు గాంధీజీ జిల్లాకు వచ్చారు. మా నాన్న మేడా రామయ్య, చిన్నాన్న మేడా సుబ్బయ్య మహాత్మాగాంధీకి జిల్లాలో తోడుగా ఉన్నారు. గాంధీజీ ఆశయాలంటే వారికి పంచ ప్రాణాలుగా ఉండేవి. నేను గుంటూరులో చదువుకునే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మా సహచరుడుగా ఉండేవాడు. గాంధేయవాదాన్ని అతిగా ఇష్టపడే రోశయ్య ప్రభావం మాపై చాలా ఉంది. ఇప్పటికీ గాంధీజీ జయంతి, వర్ధంతులను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నాం. – మేడా సుబ్రమణ్యం, ఇన్‌కమ్‌టాక్స్ కన్సల్టెంట్, అనంతపురం గాంధీకట్టకు మహర్దశ! తాడిపత్రి టౌన్ : స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు మహత్మగాంధీకి తాడిపత్రి పట్టణంతో విడదీయలేని అనుబంధం ఉంది. 1942లో సత్యాగ్రహ ఉద్యమం బలోపేతం చేసేందుకు గాంధీ తాడిపత్రికి రైలులో వచ్చారు. పట్టణంలోని మెయిన్ బజారు, శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయనకు గుర్తుగా కట్టను నిర్మించారు. ప్రస్తుతం ఆ కట్ట గాంధీకట్టగా పిలవబడుతోంది. మునిసిపల్ అధికారులు గాంధీ కట్ట వద్ద పార్కు ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ––––––––––––––––– అడిగుప్ప.. శాంతి బాట! గుమ్మఘట్ట : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాలు కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలంలోని అడిగుప్ప గ్రామస్తులు. దశాబ్దకాలంగా ఈ గ్రామంలో ఎవరూ మద్యం జోలికి వెళ్లడం లేదు. ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలకు ఇక్కడ అవకాశమే లేదు. ఇక్కడ అందరూ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు నివసిస్తున్నారు. నిరక్షరాస్యత అధికంగానే ఉన్నా, తరతరాలుగా ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లను ఆచరిస్తూ హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో పయనిస్తున్నారు. పూర్వం ఇతర ప్రాంతాలకు చెందిన వారు గ్రామస్తులకు మధ్యం, కోడి మాంసం ఎరగాచూపి లోబరుచుకునేందుకు యత్నించగా, స్థానికంగా ఉన్న పాళేగాడు మద్యం ముట్టకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు గురికాకూడదని అప్పట్లో ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి వారు ఆ ప్రతిజ్ఞను శిరోధార్యంగా భావించి అనుసరిస్తున్నారు. -
అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛ ఏపీ
-
పెన్షన్‌దారుల కోసం 19, 20 తేదీల్లో ప్రత్యేక సర్వే
-
ఆధార్‌తోనే సంక్షేమ పథకాల అమలు
అనంతపురం అగ్రికల్చర్ : అక్టోబరు 2 నుంచి ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకు ఖాతాలు, ఆధార్ సీడింగ్‌తోనే అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి రెగ్యులర్ బ్యాంకు ఖాతాతోపాటు పొదుపు ఖాతాను కూడా ప్రారంభించాలని తెలిపారు. ఈ అంశంలో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేసేందుకు కలెక్టరు సొలమన్ ఆరోగ్యరాజ్ తీసుకుంటున్న చొరవను అభినందించారు. మిగతా జిల్లాలు కూడా ఈ ప్రక్రియను పాటించాలని సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి లబ్ధిచేకూర్చేప్రధానమంత్రి జన-ధన యోజన పథకాన్ని ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ఇదే సమయానికి ప్రతి జిల్లాలో ప్రధానమంత్రి జన - ధన యోజన ఖాతాలను పంపిణీ చేయాలని తెలిపారు. ఆంధ్రబ్యాంకు జనరల్ మేనేజరు, రాష్ట్ర స్ధాయి బ్యాంకర్స్ సంప్రదింపుల కమిటీ కన్వీనరు దొరైస్వామి మాట్లాడుతూ ప్రతి పొదుపు ఖాతాకు రూ.లక్ష జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తూ రూపే కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జేసీ సత్యనారాయణ, బ్యాంకింగ్ నిపుణులు రామిరెడ్డి, వెంకట్వేరరావు, ఎల్డీఎం జయశంకర్ పాల్గొన్నారు.