రాష్ట్ర ప్రభుత్వానికి అవి అద్భుత పథకాలు | Fairytale schemes the state government | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వానికి అవి అద్భుత పథకాలు

Published Thu, Oct 2 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

రాష్ట్ర ప్రభుత్వానికి అవి అద్భుత పథకాలు

రాష్ట్ర ప్రభుత్వానికి అవి అద్భుత పథకాలు

అక్టోబర్ 2.. గాంధీ జయంతి రోజు.. రాష్ట్రంలో నాలుగు అద్భుత కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఊరిస్తోంది. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. దానితోపాటు రాష్ట్రంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు హామీలను ఆచరణలోకి తేనున్నట్లు టీడీపీ సర్కారు ఘనంగా ప్రకటించింది. ఇంతకీ ఆ నాలుగు పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయా? అంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ ఆశ ఏ కోశానా నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ సుజల పది గ్రామాలకు మించి నీరివ్వలేని రీతిలో లీక్ అయిపోయింది. సామాజిక పెన్షన్ మొత్తాలు పెరుగుతాయన్న ఆనందం కంటే.. వేలాది పెన్షన్లు రద్దవుతాయన్న ఆందోళన ఎక్కువగా ఉంది. ఇక గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అన్న హామీ నిరంతర ‘కోత’లుగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తొలి దశలో జిల్లాలో రెండు మండలాలనే ఎంపికచేశారు. మరోవైపు ఆరోగ్యశ్రీ పేరు మార్పు తప్ప అదనంగా ఒనగూడే ప్రయోజనమేమిటో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఆర్భాటంగా ప్రారంభమవుతున్న ఈ నాలుగు పథకాలకు జరిగిన అరకొర ఏర్పాట్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..        -ఎల్.ఎన్.పేట
 
 10 గ్రామాలకే  ఎన్టీఆర్ సుజల
 గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన ‘ఎన్టీఆర్ సుజల’ పథకానికి దాతలపైనే ఆధారపడటంతో అది దాదాపు నీరుగారిపోయింది. ఒక్కో గ్రామంలో సుజల పథకం ఏర్పాటుకు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దాతలు పెద్దగా స్పందించకపోవడంతో జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని 10 గ్రామాల్లో మాత్రమే ప్రస్తుతం ఈపథకం అమలుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రంగం సిద్ధం చేశారు. దాతలు ముందుకు వస్తే మిగిలిన గ్రామాల్లోనూ అమలు చేస్తామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఆర్.రవీంద్రనాథ్ చెప్పారు.
 
 పెంపా.. ముంపా..
 ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు అందిస్తున్న రూ.200 పింఛను మొత్తాన్ని రూ.1000, రూ.1,500కు పెంచుతామని ఎన్నికల వాగ్దానం చేసిన టీడీపీ నేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను సాధ్యమైనంత వరకు తగ్గించే ఎత్తుగడలు వేశారు. గాంధీ జయంతి నుంచి దీన్ని అమలు చే స్తామని చెప్పి, దానికి ముందు లబ్ధిదారులు వివరాల సేకరణ పేరుతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో అందరూ టీడీపీవారే ఉం డటంతో మిగిలిన రాజకీయ పార్టీల మద్దతుదారుల పేర్లు జాబితాల నుంచి తొలగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,92,630 మంది పింఛన్లు పొందుతుండగా.. సర్వే అనంతరం వీరిలో 2,69,836 మం దినే అర్హులుగా గుర్తించారు. మిగి లిన 30, 534 మంది లబ్ధిదారుల పేర్లను జాబితాల నుంచి తొలగించారు.
 
 నిరంతర ‘కోత’లు
 అక్టోబర్ రెండో తేదీ నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ విని యోగదారులకు 24 గంటలూ కరెంటు సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా రెండు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీ లు, 39 మండలాల కే దీన్ని వర్తింపజేయాలని చివరికి నిర్ణయిం చారు. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, రేగిడి మం డలాలకే చోటు లభించింది.  జిల్లా లో ప్రస్తుతం ఎప్పుడు కరెంటు ఉం టుందో ఎప్పడు పోతుందో తెలి య ని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ వినియోగం పెరిగినంతగా ఉత్పత్తి పెరగటంలేదని, ఇలాంటి పరి స్థితుల్లో రోజంతా  సరఫరా చేయలేమ ని ట్రాన్స్‌కో అ ధికారులు చే తులెత్తేస్తున్నారు.
 
 ఎన్టీఆర్ ‘భరోసా’ పెరుగుతుందా?
 కొన్నేళ్లుగా పేద రోగులకు అండగా నిలిచి.. ఇటీవల నీరసించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మారింది. ఎన్టీఆర్ భరోసాగా మారిపోయింది. పేరు మారినా తీరు మారలేదు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చనున్నట్లు సీఎం, ఆరోగ్య మంత్రి ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. అక్టోబర్ రెండు నుంచే పేరు మారిన పథకం అందుబాటులోకి వస్తున్నప్పటికీ కొత్త వ్యాధులను చేర్చినట్లు ఎటువంటి ఆదేశాలు గానీ, ప్రకటనలు గానీ రాలేదు. అలాగే అక్టోబర్ రెండో తేదీ నుంచి దీన్ని అమలు చేయాలని తమకు ఇంతవరకు ఆదేశాలు రాలేదని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్యాధికారులు చెబుతున్నారు.
 
 
 ఊళ్లో లేనని పింఛను రద్దు
 నాకు ఆనారోగ్యం చేసింది. బాగు చేయించుకునేందుకు పట్టణంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లాను. రెండు నెలులు రాలేకపోయాను. మూడో నెలలో పింఛను రద్దు చేశారు. పింఛను ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి పింఛను ఇవ్వాలి.
 -ఎన్.బుచ్చెమ్మ,
 ఎల్.ఎన్.పేట
 
 ప్రజలను మోసం చేసేందుకే..
 చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారు. దీన్ని గుర్తించేందుకు ఎంతో కాలం పట్టలేదు. ప్రజలను మోసం చేసేందుకు అనేక పథకాల పేర్లు చెబుతున్నారు. ఏ పథకం కావాలన్నా కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలని నిబంధనలు విధిస్తున్నారు. ప్రజ లను మభ్యపెట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారు.
 -శివ్వాల పావని,
 పూశాం గ్రామం
 
 10 గ్రామాలకే  ఎన్టీఆర్ సుజల
 
 నియోజకవర్గం     మండలం 
 శ్రీకాకుళం    గార    అడవివరం
 నరసన్నపేట    నరసన్నపేట     తామరాపల్లి
 పాతపట్నం    పాతపట్నం    పాతపట్నం
 ఆమదాలవలస    పొందూరు    పనుకుపర్తి
 రాజాం    సంతకవిటి    మామిడిపల్లి
 ఇచ్ఛాపురం    కవిటి    రాజపురం
 పలాస    పలాస    రెంటికోట
 పాలకొండ    సీతంపేట    తురాయిపేట
 టెక్కలి    సంతబొమ్మాళి    సంతబొమ్మాళి
 ఎచ్చెర్ల    లావేరు    తాళ్లవలస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement