October 2
-
అక్టోబర్ 2న హోమ్షాప్18 స్పెషల్ సేల్స్
హైదరాబాద్: అక్టోబర్ అమ్మకాలకు ఈ కామర్స్ సంస్థలన్నీ సిద్ధమవటంతో తానూ బరిలో ఉన్నట్లు హోమ్షాప్-18 సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న తమ ప్రత్యేక అమ్మకాలు మొదలవుతాయని, ఆ రోజు ఉదయం 6 గంటల నుంచీ తమ చానల్లో ప్రత్యేక వస్తువుల ప్రదర్శన ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆఫర్లన్నీ హోమ్షాప్-18 వెబ్ పోర్టల్‌లో కూడా లభిస్తాయని తెలిపింది. -
రెండున సీవైఎఫ్ వార్షికోత్సవం
రాజమహేంద్రవరం రూరల్ రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీ పందిరిహాల్లో అక్టోబర్ రెండున సాయంత్రం ఐదు గంటలకు క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్(సీవైఎఫ్) 19వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రెవరెండ్ బీహెచ్‌వీ మూర్తిరాజు తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని కర్మెల్ ప్రేయర్ సెంటర్లో సీవైఎఫ్ రాజమహేంద్రవరం డివిజన్ సమావేశం చైర్మన్ పి.రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. మూర్తిరాజు మాట్లాడుతూ సీవైఎఫ్ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సీవైఎఫ్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం బైబిల్ టెస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీవైఎఫ్ ఇంటర్నేషనల్ బోర్డు రెవరెండ్ మిస్సా విజయ్‌కుమార్, సీహెచ్ శామ్యూల్‌విక్టర్, దడాల విల్సన్, విలియమ్స్, డేవిడ్, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సూపర్ ఆఫర్లతో బిగ్ బిలియన్ డేస్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించబోతుంది. గాంధీజయంతి రోజు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ అమ్మకాలు చేపట్టనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది మూడోది. ఎలాంటి ఈఎమ్ఐ ధరలు లేకుండా ఉత్పత్తులు అందించడం,, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ వంటి వాటిని కన్సూమర్ ప్రొగ్రామ్స్‌ను కింద ఫ్లిప్‌కార్ట్ ఈ అమ్మకాలు చేపట్టనుంది. ఆన్లైన్ అమ్మకందారులను ఎక్కువగా ఆకట్టుకోవడంతో పాటు, రెవెన్యూలను ఆర్జించే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్స్ కంపెనీకి దోహదం చేయనున్నాయి. ఈ అమ్మక హైలైట్స్... ఈఎమ్ఐ ధరలు లేకపోవడం, ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లు. 80 ప్లస్ ప్రొడక్ట్ కేటగిరీలు, మంచి ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం అందించడం ఎలక్ట్రానిక్ ఉపకరణలు, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో ప్రత్యేక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం, ఫలితంగా తక్కువ ధరలకే ప్రీమియం ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్‌కు ప్రత్యేక ఆఫర్లు, అదనంగా 10 శాతం వరకు పొదుపు -
'ప్రతి అక్టోబర్ 2కు ఒక సినిమా'
ముంబై: బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తన సినిమాలతో జాతిపిత మహాత్మ గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. గాంధీ జయంతికి తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 2న 'హైదర్' సినిమా విడుదల చేసిన భరద్వాజ్ ఈసారి 'తల్వార్' వదులుతున్నారు. 'తన సినిమాల విడుదల తేదీలపై భరద్వాజ్ చాలా ఎగ్జైట్ గా ఉన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 2న తన సినిమా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నార'ని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. నోయిడా డబుల్ మర్డర్ కేసు ఆధారంగా 'తల్వార్' సినిమాను విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. ఈనెలారంభంలో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి సానుకూల స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. -
రాష్ట్ర ప్రభుత్వానికి అవి అద్భుత పథకాలు
అక్టోబర్ 2.. గాంధీ జయంతి రోజు.. రాష్ట్రంలో నాలుగు అద్భుత కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఊరిస్తోంది. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. దానితోపాటు రాష్ట్రంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు హామీలను ఆచరణలోకి తేనున్నట్లు టీడీపీ సర్కారు ఘనంగా ప్రకటించింది. ఇంతకీ ఆ నాలుగు పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయా? అంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ ఆశ ఏ కోశానా నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ సుజల పది గ్రామాలకు మించి నీరివ్వలేని రీతిలో లీక్ అయిపోయింది. సామాజిక పెన్షన్ మొత్తాలు పెరుగుతాయన్న ఆనందం కంటే.. వేలాది పెన్షన్లు రద్దవుతాయన్న ఆందోళన ఎక్కువగా ఉంది. ఇక గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అన్న హామీ నిరంతర ‘కోత’లుగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తొలి దశలో జిల్లాలో రెండు మండలాలనే ఎంపికచేశారు. మరోవైపు ఆరోగ్యశ్రీ పేరు మార్పు తప్ప అదనంగా ఒనగూడే ప్రయోజనమేమిటో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఆర్భాటంగా ప్రారంభమవుతున్న ఈ నాలుగు పథకాలకు జరిగిన అరకొర ఏర్పాట్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. -ఎల్.ఎన్.పేట 10 గ్రామాలకే ఎన్టీఆర్ సుజల గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన ‘ఎన్టీఆర్ సుజల’ పథకానికి దాతలపైనే ఆధారపడటంతో అది దాదాపు నీరుగారిపోయింది. ఒక్కో గ్రామంలో సుజల పథకం ఏర్పాటుకు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దాతలు పెద్దగా స్పందించకపోవడంతో జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని 10 గ్రామాల్లో మాత్రమే ప్రస్తుతం ఈపథకం అమలుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రంగం సిద్ధం చేశారు. దాతలు ముందుకు వస్తే మిగిలిన గ్రామాల్లోనూ అమలు చేస్తామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ఆర్.రవీంద్రనాథ్ చెప్పారు. పెంపా.. ముంపా.. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు అందిస్తున్న రూ.200 పింఛను మొత్తాన్ని రూ.1000, రూ.1,500కు పెంచుతామని ఎన్నికల వాగ్దానం చేసిన టీడీపీ నేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను సాధ్యమైనంత వరకు తగ్గించే ఎత్తుగడలు వేశారు. గాంధీ జయంతి నుంచి దీన్ని అమలు చే స్తామని చెప్పి, దానికి ముందు లబ్ధిదారులు వివరాల సేకరణ పేరుతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో అందరూ టీడీపీవారే ఉం డటంతో మిగిలిన రాజకీయ పార్టీల మద్దతుదారుల పేర్లు జాబితాల నుంచి తొలగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,92,630 మంది పింఛన్లు పొందుతుండగా.. సర్వే అనంతరం వీరిలో 2,69,836 మం దినే అర్హులుగా గుర్తించారు. మిగి లిన 30, 534 మంది లబ్ధిదారుల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. నిరంతర ‘కోత’లు అక్టోబర్ రెండో తేదీ నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ విని యోగదారులకు 24 గంటలూ కరెంటు సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా రెండు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీ లు, 39 మండలాల కే దీన్ని వర్తింపజేయాలని చివరికి నిర్ణయిం చారు. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, రేగిడి మం డలాలకే చోటు లభించింది. జిల్లా లో ప్రస్తుతం ఎప్పుడు కరెంటు ఉం టుందో ఎప్పడు పోతుందో తెలి య ని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ వినియోగం పెరిగినంతగా ఉత్పత్తి పెరగటంలేదని, ఇలాంటి పరి స్థితుల్లో రోజంతా సరఫరా చేయలేమ ని ట్రాన్స్‌కో అ ధికారులు చే తులెత్తేస్తున్నారు. ఎన్టీఆర్ ‘భరోసా’ పెరుగుతుందా? కొన్నేళ్లుగా పేద రోగులకు అండగా నిలిచి.. ఇటీవల నీరసించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మారింది. ఎన్టీఆర్ భరోసాగా మారిపోయింది. పేరు మారినా తీరు మారలేదు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చనున్నట్లు సీఎం, ఆరోగ్య మంత్రి ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. అక్టోబర్ రెండు నుంచే పేరు మారిన పథకం అందుబాటులోకి వస్తున్నప్పటికీ కొత్త వ్యాధులను చేర్చినట్లు ఎటువంటి ఆదేశాలు గానీ, ప్రకటనలు గానీ రాలేదు. అలాగే అక్టోబర్ రెండో తేదీ నుంచి దీన్ని అమలు చేయాలని తమకు ఇంతవరకు ఆదేశాలు రాలేదని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్యాధికారులు చెబుతున్నారు. ఊళ్లో లేనని పింఛను రద్దు నాకు ఆనారోగ్యం చేసింది. బాగు చేయించుకునేందుకు పట్టణంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లాను. రెండు నెలులు రాలేకపోయాను. మూడో నెలలో పింఛను రద్దు చేశారు. పింఛను ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి పింఛను ఇవ్వాలి. -ఎన్.బుచ్చెమ్మ, ఎల్.ఎన్.పేట ప్రజలను మోసం చేసేందుకే.. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారు. దీన్ని గుర్తించేందుకు ఎంతో కాలం పట్టలేదు. ప్రజలను మోసం చేసేందుకు అనేక పథకాల పేర్లు చెబుతున్నారు. ఏ పథకం కావాలన్నా కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలని నిబంధనలు విధిస్తున్నారు. ప్రజ లను మభ్యపెట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారు. -శివ్వాల పావని, పూశాం గ్రామం 10 గ్రామాలకే ఎన్టీఆర్ సుజల నియోజకవర్గం మండలం శ్రీకాకుళం గార అడవివరం నరసన్నపేట నరసన్నపేట తామరాపల్లి పాతపట్నం పాతపట్నం పాతపట్నం ఆమదాలవలస పొందూరు పనుకుపర్తి రాజాం సంతకవిటి మామిడిపల్లి ఇచ్ఛాపురం కవిటి రాజపురం పలాస పలాస రెంటికోట పాలకొండ సీతంపేట తురాయిపేట టెక్కలి సంతబొమ్మాళి సంతబొమ్మాళి ఎచ్చెర్ల లావేరు తాళ్లవలస -
అమ్మో.. అక్టోబర్ రెండా!
ఏలూరు : వంద రోజుల పాలన పూర్తయింది, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం సాధించింది శూన్యం కావడంతో పాలనపై ప్రజలు పెదవి విరుస్తుండగా.. ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయిఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేశామని పించుకునేందుకు పాలకులు కసరత్తు చేస్తున్నారు. ఆ బాధ్యతను మాత్రం అధికార యంత్రాంగంపైనే వేస్తున్నారు. అక్టోబర్ 2నుంచి సామాజిక పింఛను మొత్తాల్ని పెంచుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను కుదిం చే కసరత్తు మొదలుపెట్టింది. వివిధ పథకాలకు సంబంధించి గతంలో ఇచ్చి న మంజూరు పత్రాలను రద్దు చేసే కార్యక్రమానికీ తెరలేపింది. ఈ బాధ్యతలతోపాటు కొత్త కార్యక్రమాల అమలుకు సంబంధించిన పనుల భారం కూడా అధికారుల నెత్తినపడింది. దీంతో అక్టోబర్ 2వ తేదీని తలచుకుని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. పథకాల సంకటం కొత్త పథకాల అమలు, పాత పథకాలను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అధికారులకు సంకటంగా మారాయి. అక్టోబర్ 2 నుం చి వివిధ పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు, ఉద్యోగులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. అదే రోజు నుంచి లబ్ధిదారులకు ఇచ్చే పింఛ ను మొత్తాల పెంపుదల కార్యక్రమంతోపాటు రూ.2కే 20 లీటర్ల నీరందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి, జన్మభూమి-మన ఊరు, 24 గంటల విద్యుత్ సరఫరా తదితర కార్యక్రమాలను అమలు చేయూల్సి ఉంది. మరోవైపు గతంలో వివిధ పథకాలకు సంబంధించి అధికారులు ఇచ్చిన మంజూరును వారిచేతే రద్దు చేరయిం చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదేనెల 3న విజయదశమి కాగా, సెలవు రోజుల్లో ఊపిరి సలపని కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడంతో అధికారులు ఆయూ పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసే విష యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పింఛను లబ్ధిదారుల్లో కలవరం ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారి అర్హతలను తనిఖీ చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం అంతా టీడీపీ నాయకులు, కార్యకర్తల కనుసన్నల్లోనే జరుగుతోంది. అనర్హత పేరిట లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. పనిలో పనిగా టీడీపీ శ్రేణు లు సూచించేవారికి పింఛన్లు ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం వల్ల అర్హులైన పింఛనుదారులు రోడ్డునపడే ప్రమాదం కనిపిస్తోంది. టీడీపీ శ్రేణుల సూచనల మేరకు అర్హులైన వారిని తొలగిస్తే ఆ పాపం తమకు చుట్టుకుంటుందని అధికారులు, ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పాత వాళ్లకు తొలగించి.. కొత్త వాళ్లకిస్తారట జిల్లాలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ, చేనేత పిం ఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య 3,30,661 కాగా, వీరంతా ఆధార్ కార్డు జిరాక్స్, వయసు, వైకల్యం ధ్రువీకరణ పత్రాలను అందిస్తేనే వారికి పింఛను కొనసాగుతుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల అర్హతలను తనిఖీ చేసే కార్యక్రమం ఆదివారం వరకూ నిర్వహిస్తున్నారు. ఇది ముగిశాక.. సోమవారం నుంచి పింఛన్ల కోసం కొత్త వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక చేత్తో పాత పింఛన్లు తొలగించి.. మరోచేత్తో కొత్తవారికి మంజూ రు చేయటం ద్వారా గొప్పలు చెప్పుకునేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి జన్మభూమి ఎపిసోడ్ కొనసాగింపు అక్టోబర్ 2నుంచి ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో జన్మభూమి ఎపిసోడ్‌ను కొనసాగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి గ్రామం, శివారు ప్రాం తాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేలా రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనూ ఇదేవిధంగా గ్రామసభలు పెట్టి ప్రజలతో తిట్టించుకున్న అధికారులు మళ్లీ ఆ కార్యక్రమం పేరు చెబితే హడలిపోతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాజధానిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల సమీక్షలతో అధికారులకు ఊపిరి సలపడం లేదు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 2నుంచి తలపెట్టే కార్యక్రమాలను తలచుకుని వారంతా డీలాపడుతున్నారు. ఆర్వో ప్లాంట్ల స్థాపన అనుమానమే జిల్లాలో సుజల స్రవంతి కార్యక్రమం కింద మొదటి దశలో 435 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. వీటిని స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో నడపాల్సి ఉంటుంది. వీటిని నడపడానికి ఇప్పటివరకు 200 మంది మాత్రమే ముందుకొచ్చారు. దీంతో మిగిలిన ప్లాంట్లను ఎలా ఏర్పాటు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 18వరకు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై అవగాహన శిబిరాలు నిర్వహించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ దాతలను కలిసి ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. అక్టోబర్ 2నాటికి సగం ప్లాంట్లరుునా ఏర్పాటు చేసేలా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. నిరంతరాయ విద్యుత్ అనుమానమే ప్రభుత్వం పేర్కొన్న ప్రాధాన్యత అంశాల్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయూల్సి ఉంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 444 వ్యవసాయ ఫీడర్ల నుంచి త్రీ ఫేజ్‌ను వేరు చేయూల్సి ఉంది. మొదటి దశలో 159 ఫీడర్లను వేరుచేసి లైన్లు వేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం నేటికీ పూర్తికాలేదు. ఎప్పటికి అవుతుందనేది విద్యుత్ శాఖ అధికారులకే తెలి యడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే కార్యక్రమం అనుమానంగానే ఉంది.