
'ప్రతి అక్టోబర్ 2కు ఒక సినిమా'
ముంబై: బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తన సినిమాలతో జాతిపిత మహాత్మ గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. గాంధీ జయంతికి తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 2న 'హైదర్' సినిమా విడుదల చేసిన భరద్వాజ్ ఈసారి 'తల్వార్' వదులుతున్నారు.
'తన సినిమాల విడుదల తేదీలపై భరద్వాజ్ చాలా ఎగ్జైట్ గా ఉన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 2న తన సినిమా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నార'ని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. నోయిడా డబుల్ మర్డర్ కేసు ఆధారంగా 'తల్వార్' సినిమాను విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. ఈనెలారంభంలో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి సానుకూల స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది.