రెండున సీవైఎఫ్‌ వార్షికోత్సవం | cyf foundation day october 2 | Sakshi
Sakshi News home page

రెండున సీవైఎఫ్‌ వార్షికోత్సవం

Published Sat, Sep 24 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

cyf foundation day october 2

రాజమహేంద్రవరం రూరల్‌
రాజమహేంద్రవరంలోని ఆనంద్‌ రీజెన్సీ పందిరిహాల్లో అక్టోబర్‌ రెండున సాయంత్రం ఐదు గంటలకు క్రిస్టియన్‌ యూత్‌ ఫెలోషిప్‌(సీవైఎఫ్‌) 19వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ బీహెచ్‌వీ మూర్తిరాజు తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని కర్మెల్‌ ప్రేయర్‌ సెంటర్‌లో సీవైఎఫ్‌ రాజమహేంద్రవరం డివిజన్‌ సమావేశం చైర్మన్‌ పి.రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. మూర్తిరాజు మాట్లాడుతూ సీవైఎఫ్‌ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సీవైఎఫ్‌ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం బైబిల్‌ టెస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీవైఎఫ్‌ ఇంటర్నేషనల్‌ బోర్డు రెవరెండ్‌ మిస్సా విజయ్‌కుమార్, సీహెచ్‌ శామ్యూల్‌విక్టర్, దడాల విల్సన్, విలియమ్స్, డేవిడ్, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement