ముంబై: మహత్మాగాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీపై వినూత్న రీతిలో విమర్శలు సంధించారు. మాటల్లో కాకుండా.. కార్టూన్ రూపంలో మోదీని టార్గెట్ చేశారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ పక్కపక్కనే నిల్చుని ఉన్న ఒక కార్టూన్‌ను తన ఫేస్‌బుక్ పేజ్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆ కార్టూన్లో గాంధీ చేతిలో ఆయన ప్రసిద్ధ ఆత్మకథ ‘మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్’(సత్యంతో నా ప్రయోగాలు) అని మరాఠీలో ఉన్న పుస్తకం ఉండగా.. మోదీ చేతిలో ‘మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ లైస్(అసత్యాలతో నా ప్రయోగాలు) అనే పుస్తకం ఉంటుంది. కార్టూన్ పై భాగంలో ‘ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు’ అనే కాప్షన్ ఉంటుంది. గతంలో బాల్‌ఠాక్రే నేతృత్వంలో వచ్చిన మార్మిక్ పత్రికలో రాజ్ ఠాక్రే కార్టూన్లు విరివిగా వచ్చేవి.