
అర్హులైన ఖైదీలను విడుదల చేస్తాం: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: ఆక్టోబర్ 2న జాతిపిత మహత్మ గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. దేవాదాయ, మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన జీవోలు రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఉమ్మడి పోలీసులు ఉండాలని గవర్నర్ను కోరనున్నట్లు చినరాజప్ప తెలిపారు.