Andhra Pradesh Deputy Chief Minister
-
'రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిందని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మావోయిస్టులు ఉనికి కోసమే పాకులాడుతున్నార విమర్శించారు. తీర ప్రాంతాలలో భద్రతను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. -
దాసరి గన్మెన్లను కోరిన మాట వాస్తవమే
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గన్మెన్లను కేటాయించమని తనను కోరిన మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్ప బుధవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని భద్రతా కమిటీ చూస్తుందని తాను దాసరికి వెల్లడించానని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కూడా తమకు భద్రత పెంచాలని కోరారని చెప్పారు. భద్రత కమిటీ మీ అంశాన్ని పరిశీలిస్తుందని వారికి వివరించినట్లు తెలిపారు. ఎవరికి భదత్ర కల్పించాలని ఎవరికి వద్దు అనే అంశంలో తన ప్రమేయం ఏమీ ఉండదని చినరాజప్ప వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర బోగ్గు శాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావుకు భద్రతగా ఉన్న గన్మెన్ల సౌకర్యాన్ని ఇటీవల ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దాంతో తనకు గన్మెన్ల భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్పను దాసరి నారాయణరావు కోరిన విషయం తెలిసిందే. -
అర్హులైన ఖైదీలను విడుదల చేస్తాం: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: ఆక్టోబర్ 2న జాతిపిత మహత్మ గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. దేవాదాయ, మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన జీవోలు రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఉమ్మడి పోలీసులు ఉండాలని గవర్నర్ను కోరనున్నట్లు చినరాజప్ప తెలిపారు.