
కొడిమ్యాల (చొప్పదండి): తాము ఎట్టి పరిస్థితుల్లో ఓటును అమ్ముకోబోమని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామస్తులు ప్రతినబూనారు. గాంధీ జయంతి సం దర్భంగా పార్టీలకతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రలోభాలకు లొంగకుండా సమర్థుడైన అభ్యర్థికి పట్టం కట్టినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు నోటును వ్యతిరేకించాలని తీర్మానించారు. మంగళవారం సమావేశమైన గ్రామస్తులు.. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment