
సాక్షి, హైదరాబాద్ : రామ్‌గోపాల్ వర్మ.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సంచలన దర్శకుడు, నిత్యం ఏదో ఒక వివాదానికి పురుడు పోసే వ్యక్తి వర్మ. నచ్చిన, మెచ్చిన ఏ అంశాన్ని అయినా నిర్మొహమాటంగా ప్రకటించగల ధైర్య శీలి. ఏ అంశంపైనైనా.. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా స్పందిస్తాడు. అతనో మేధావి అని కొందరు.. తిక్కలోడు అని మరికొందరు అంటుంటారు. కానీ వర్మ మాత్రం ఇవేవి పట్టించుకోడు. ఆయనకు ఏం అనిపిస్తే అదే చెస్తాడు. తాజాగా గాంధీ జయంతి పురస్కరించుకొని ఆయనో ట్వీట్ చేశారు. గాంధీ గెటప్‌లో తన ఫోటోను మార్పింగ్ చేసుకొని ‘అతనిలో నేను దాగి ఉన్నానని నాకు తెలియదు. హ్యాపీ మై జయంతి’ అని మరో ట్విట్ చేశారు.
WHAATTT??? Never knew I had him in me 🙄🙄🙄 Happy My Jayanthi💐💐💐 pic.twitter.com/VdnYT90Gfs
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2019
‘బ్రిటిష్ పాలనలో భారతీయుల బానిసత్వం పోవడానికి పోరాడి భాయతీయ పాలన రాబట్టి స్వాతంత్రం తెచ్చిపెట్టారు అలనాటి గాంధీ. సమరయోధులు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్త్రీ బానిసత్వం పోవడానికి, వాళ్ల విలువల కోసం నిరంతరం కృషి చేస్తున్నవాడు ఒక్క రామ్‌గోపాల్ వర్మ మాత్రమే’ అని వర్మముదురుని అనే వ్యక్తి చేసిన ట్విట్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన పేరును ‘గోపాల్‌దాస్ వరంచంద్ రాంధీ’ చెబుతూ వర్మ మరో ట్వీట్ చేశాడు.
Gopaldas Varmchand Ramdhi pic.twitter.com/EW5NjeFyCd
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2019
Comments
Please login to add a commentAdd a comment