రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన నరేంద్ర మోడీ | Narendra modi launches Clean India campaign Swachh Bharat programme | Sakshi
Sakshi News home page

రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన నరేంద్ర మోడీ

Published Thu, Oct 2 2014 9:08 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన నరేంద్ర మోడీ - Sakshi

రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.  గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మోడీ స్వయంగా చీపురు పట్టారు.  ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తారు. మోడీతో పాటు పలువురు మంత్రులు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సుమారు అయిదు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు.  అంతకు ముందు మోడీ వాల్మీకి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.  మరోవైపు స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రులంతా చీపుర్లు పట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement