‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది..: హాలీవుడ్‌ నటుడు | Gandhi actor Ben revealed four lakhs of Indians participated in funeral scene | Sakshi
Sakshi News home page

Gandhi: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్‌ నటుడు

Published Sat, Oct 2 2021 1:23 PM | Last Updated on Sun, Oct 3 2021 11:22 AM

Gandhi actor Ben revealed four lakhs of Indians participated in funeral scene - Sakshi

మహాత్మా గాంధీ జీవితంపై వివిధ వెర్షన్లలో భారతీయ, అంతర్జాతీయ చిత్రాలు తెరకెక్కాయి. అందులో 1982లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘గాంధీ’ ఒకటి. ఈ మూవీలో బ్రిటీష్‌ నటుడు బెన్‌ కింగ్స్‌లే గాంధీజీ పాత్ర పోషించాడు.  గతేడాది ఈ సినిమా మళ్లీ చూసిన యాక్టర్‌.. గాంధీ అంత్యక్రియల సీన్‌ చిత్రీకరణ సమయంలో 4 లక్షలకి పైగా భారతీయులు వచ్చినట్లు తెలిపాడు.

‘ఎవరైనా ఓ వ్యక్తిని అభిమానించడం సాధారణం. కానీ ఓ సినిమాలో ఆయన పాత్రని సైతం అంతే అభిమానించడం అద్భుతం. ‘గాంధీ’ సినిమా సమయంలో అది జరిగింది. అందులో బాపూజీ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షలకు పైగా భారతీయులు హాజర​య్యారు. నిజంగా భారతదేశంలో ప్రజలు చాలా ఉదారంగా ఉంటారు’ అని నటుడు బెన్‌ తెలిపాడు. కావాలంటే ఆ సీన్‌ మీరు చూడండి అంటూ.. సీజీఐ లేని పుటేజీని షేర్‌ చేశాడు.

అయితే ఈ సీన్‌ గురించి ప్లానింగ్‌లో ఉన్నప్పుడు.. ‘దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో గాంధీ అంత్యక్రియల పుటేజీ చూపించాడు. అలాంటి సీన్‌ రిక్రియేట్‌ చేయడం కష్టం అనుకున్నా. కానీ రిచర్డ్‌ అసాధ్యాన్ని, సాధ్యం చేసి చూపించాడని’ బెన్‌ వివరించాడు. అయితే ఈ చిత్రం ఆ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల్లో 11 నామినేషన్లకు పొందగా.. 8 ఆస్కార్‌ అవార్డులు అందుకుని సత్తా చాటింది. గాంధీ జయంతి సందర్భంగా  మహాత్ముడి గొప్పతనాన్ని తెలిపే ఆ సినిమాలోని మొదటి 10 నిమిషాల వీడియోపై మీరు ఒకసారి లుక్కేయండి.

చదవండి: జాతిపిత గొప్పదనం తెలిపే చిత్రాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement