గాంధేయ పథంలో ఆంధ్రా | ABK Prasad Article On Gandhi 150th Jayanti And AP Development | Sakshi
Sakshi News home page

గాంధేయ పథంలో ఆంధ్రా

Published Tue, Oct 8 2019 5:01 AM | Last Updated on Tue, Oct 8 2019 5:04 AM

ABK Prasad Article On Gandhi 150th Jayanti And AP Development - Sakshi

గాంధీ తన జీవితాదర్శాలలో ఒకటిగా భావించి, ప్రచారం చేసిన ‘మద్యపాన నిషేధం’ గత 72 ఏళ్లలోనూ చిత్తశుద్ధితో అమలు జరపలేదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టి అమలులోకి తెచ్చిన మద్యపాన నిషేధ ప్రక్రియ ముందుకు సాగుతూ ప్రజా బాహుళ్యం ఆచరణలో ఆమోదం పొందుతూన్న సమయంలోనే ఒక దిన పత్రికాధిపతి అండతో చంద్రబాబు మధ్యలోనే ఆ ప్రక్రియకు ‘సంధి’ కొట్టించాడు. 

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన యువ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మద్య నిషేధ విధానం దశల వారీగా అమలు జరిపే పథకంలో భాగంగా, గ్రామాలలోని వేలాది బెల్టు షాపులు రద్దు అయ్యాయి. ప్రభుత్వమే క్రమంగా మద్యం ధరలను పెంచు కుంటూ ‘మధు మూర్తుల్ని’ సరుకుకు దూరం చేయడం, ఆపైన క్రమానుగతంగా మద్యం సేవించే వారిని వైద్యావసరాలకు మాత్రమే పరిమితం చేయడం అవసరం.

‘‘నా సంకెళ్లను ఛేదించుకుని మరీ ఎగిరిపోతా, నా కష్టాల కారడవిని చీల్చుకుని మరీ నింగికెగురుతా, ఓటమి పరంపరను దాటి అవలీలగా పరుగులు తీస్తా, కన్నీటి ధారల మధ్యనే వేగంగా దూసుకుపోతా, నన్ను సిలువ వేసినా మానవాళి హృదయ ద్వారాలు చేరుకుంటా, ఈ నా సుదీర్ఘ సంకల్పం ఇంతింతై విస్తరిస్తుంది’’!

జాతిపిత గాంధీజీ సంకల్ప బలానికి తోడు నీడై నిలిచిన ఈ సందేశం ఎవరిదై ఉంటుంది? గాంధీ చిన్నప్పటి కుటుంబ స్నేహి తుడు, గాంధీ న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్‌ వెళ్లేం దుకు ఆయనకి ఆర్థికంగా సాయపడిన వ్యక్తి రామ్చూదాస్‌. ఆ దరి మిలా గాంధీ కాలక్రమంలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతికి ఎదిగి నందుకు అమితానందం పొందిన రామ్చూదాస్‌ ఆ తరువాతి దశలో గాంధీకి రాసిన ఒక అభినందన లేఖలో.. 

‘దేశానికి, ప్రజలకు సేవలం దించేందుకు మీ జీవితం సార్థకమయ్యేందుకు మీరు చిరకాలం ప్రయోజనకర జీవిగా వర్ధిల్లాలి’ అని ఆశీర్వదించాడు. దానికి గాంధీ సమాధానమిస్తూ ‘మీరు దీర్ఘాయుష్మంతులు అవుగాక. నాకు సంబం ధించినంతవరకు నేను ఎక్కువ కాలం జీవించి ఉండాలనుకోవటం లేదు. ఎందుకంటే, హైందవ ధర్మాన్ని హైందవులే చేజేతులా నాశనం చేయడం చూస్తూండటం నాకు దుర్భరంగా ఉంది. వారి దృష్టిలో నేను ‘మహాత్ముణ్ణి’, కానీ నేనిప్పుడు ‘అల్పాత్ముణ్ణి’ అని గాంధీ ప్రత్యుత్తరమిచ్చారు. 

ఇదిలా ఉండగానే గాంధీజీ మరొక మిత్రుడు గాంధీలో ఏర్పడిన ఈ నిరాశ, నిస్పృహను తొలగిస్తూ ఆయన (గాంధీ) 78వ జన్మ దినోత్సవం అక్టోబర్‌ 2వ తేదీని పురస్క రించుకుని, ఒక లేఖ రాస్తూ.. నిస్పృహను తుత్తునియలు చేయగల సుప్రసిద్ధ ఆంగ్లకవి జార్జి మాథిసన్‌ సుందర కవితా పంక్తుల్ని పేర్కొన్నాడు. ఆ పంక్తుల అనుకరణే ఈ వ్యాసం మొదట్లో ఉటం కించిన పాద పంక్తులు. ఆ లేఖను గాంధీ ఒకటికి పదిసార్లు చదువు కున్నారు. ఈ విషయాన్ని సుప్రసిద్ధ ‘హిందూ’ పత్రికా సంస్థ ‘మహా త్మాగాంధీ: ది లాస్ట్‌ 200 డేస్‌’ (మహాత్ముడు: ఆఖరి 200 రోజులు) అన్న గ్రంథంలో పేర్కొంది. 

కానీ, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సంవ త్సరం కాలానికే సమ్మిళిత హైందవ ధర్మాన్ని నాశనం చేయ సంక ల్పించిన ఒక హిందూ మతోన్మాది చేతిలో మహాత్ముడు నేలకొరిగినా, కొంతమంది పాలకులకు ఏక కాలంలో గాంధీ మహాత్ముడూ, గాడ్సే మతోన్మాదీ ఆరాధ్యులే కావటం ఆశ్చర్యాలలో అనితరసాధ్యమైన ‘సూపర్‌’ ఆశ్చర్యం! అందుకే మన దేశంలో గాంధీ పుట్టిన గుజరాత్‌ సహా రాష్ట్రాలలో ఆయన జీవితాదర్శాలలో ఒకటిగా భావించి, ప్రచారం చేసిన ‘మద్యపాన నిషేధం’ 

కూడా గత 72 ఏళ్లలోనూ చిత్తశుద్ధితో అమలు జరపలేదు. ఈ వరసలో గడప దాటకపోయినా మాటలు కోటలు దాటించగల ప్రాంతీయ పార్టీలలో అగ్ర తాంబూ లం చంద్రబాబు హయాంలోని ‘తెలుగుదేశం పార్టీ’! ఆ పార్టీ వ్యవ స్థాపకుడు ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టి అమలులోకి తెచ్చిన మద్యపాన నిషేధ ప్రక్రియ ముందుకు సాగుతూ ప్రజా బాహుళ్యం ఆచరణలో ఆమో దం పొందుతూన్న సమయంలోనే ఒక దిన పత్రికాధిపతి అండతో చంద్రబాబు మధ్యలోనే ఆ ప్రక్రియకు ‘సంధి’ కొట్టించాడు.

ఆ చర్యపై రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన తిరుగుబాటుకు ఆద్యురాలు దూబ గుంట మహిళ. అయినా ఆమెను, ఆమె మద్యపాన వ్యతిరేకత మహో ద్యమాన్ని చెడిపోయిన టీడీపీ నాయకత్వం అణచివేసి, గ్రామానికొక బట్టీ, ఊరుకి వీధికొక ‘బెల్ట్‌షాపు’ల చొప్పున వెలిసిన ఫలితంగా ప్రభుత్వానికి ఎక్సైజ్‌ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సంగతి పెరు మాళ్లకెరుకేమోగానీ, మహిళలు సహా ప్రజా బాహుళ్యం జీవన విధా నం తారుమారై కకావికలమవుతూ అనేక సంసారాలు ఛిద్రమైపోతూ రావటం ప్రజల ప్రత్యక్షానుభవంగా మారింది. 

కాగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి ప్రజలు తెచ్చుకున్న వైఎస్సార్‌సీపీ, యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వెంటనే ప్రవేశపెట్టిన నూతన మద్య నిషేధ విధానం దశల వారీగా అమలు జరిపే పథకంలో భాగంగా– ముందు గ్రామాలలో ఏర్పడిన వేలాది బెల్టు షాపులు రద్దు అయ్యాయి. ఇది రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా మంచి చేస్తుంది. ప్రభుత్వమే క్రమంగా మద్యం ధరలను పెంచుకుంటూ ‘మధు మూర్తుల్ని’ సరుకుకు దూరం చేయడం, ఆ పైన క్రమానుగతంగా ప్రజల సహకారంతో మద్యం సేవించే వారిని వైద్యావసరాలకు మాత్రమే పరిమితం చేయడం అవసరం. 

అందుకే గాంధీజీ తాగుడును ప్రోత్సహించుతూ మద్యం అమ్మ కాలమీద ప్రభుత్వాలు ఆదాయం గుంజాలనుకోవటం అభివృద్ధి నిరోధకర పన్నుల విధానమని ఖండించాల్సి వచ్చింది. అందుకే గాంధీ అన్నారు: ‘స్వతంత్ర భారతదేశంలో విధించే ఏ పన్నులయినా సరే పౌరులు ప్రయోజనం పొందేలా, వారికి అందించే సేవల ద్వారా ప్రజలు పదిరెట్లు లాభించగలగాలి, అదే ఆరోగ్యకరమైన పన్నుల విధానం.. అలా గాకుండా కేవలం తాగించడానికి మద్యంపై ఎక్సైజ్‌ పన్ను విధించడం అంటే– ప్రజల్ని నైతికంగా శారీరకంగా బలహీ నపరిచి అవినీతి పాలు చేయడమనే అర్థం. 

పైగా, మద్యం సేవించ డానికి వీలు కల్పించడం ద్వారా అందుకయ్యే ఖర్చును భరించలేని పేద ప్రజలనెత్తిపైన బండరాయిని పడేయడమే అవుతుంది. కాగా, మద్య నిషేధాన్ని అమలు పర్చడం ద్వారా కోల్పోయే ప్రభుత్వ ఆదాయం పైకి కనిపించేంత భారీ మొత్తం కాదు. ఎందుకంటే, మద్య నిషేధాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి దఖలుపడే అభి వృద్ధి నిరోధక పన్ను కాస్తా, తాగుడుకి అలవాటుపడ్డ వాడు ఆ అలవాటు నుంచి బయటపడి, ఆ డబ్బును మంచి పనికి ఉపయో గించడానికి తోడునీడవుతుంది’ అని గాంధీ ప్రబోధించారు. 

అంతేగాదు, కేవలం మద్య నిషేధాన్ని అమలు చేయడంతో పాటు సామాజిక ప్రగతికి అవసరమైన సంఘ సంస్కరణలకు అవస రమైన విధానాలను ఆటంకపరిచే ధనికవర్గ మోతుబరుల, కోట్లకు పడగలెత్తిన వర్గ ప్రయోజనాలకు కత్తెర పడటం కూడా అంతే అవ సరం. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ, పౌర సమాజంలోని వివిధ వర్గాలను (కుల, మత, వర్ణపరంగా) అవి నీతి పాలుచేయకుండా తన మనుగడను కొనసాగించుకోలేదు. కను కనే ‘అభివృద్ధి’ ముసుగులో గుజరాత్‌లో నడుస్తున్న ‘అభివృద్ధి (డెవ లప్‌మెంట్‌ పాటర్న్‌) నమూనా’తో పెక్కుమంది ఆర్థిక వేత్తల భ్రమలు తొలగిపోవలసి వచ్చింది.

మరొక మాటలో చెప్పాలంటే–పెట్టుబడిదారీ వ్యవస్థలో సంస్థా గతమైన దోపిడీ అనివార్యం అవుతున్నందునే ఆ వ్యవస్థ లొసుగుల్ని, వాటివల్ల సమాజం పొందుతున్న కష్టనష్టాల్ని, వంచనను, బాధలను ప్రజా బాహుళ్యం గ్రహించి, ప్రశ్నించి నిలదీయకుండా ఉండేందుకు– మద్యానికి, ఇతర వ్యసనాలకు పేదసాదల్ని, భ్రమలలో ఉండే మధ్య తరగతి ‘మందహాసుల్ని’ వ్యవస్థ బలిచేస్తూంటుందని మరచిపో రాదు. దోపిడీ వ్యవస్థలు సామాన్యుల్ని గురిచూసి వ్యసనాలకు ‘ఎర’ బెట్టిన తరువాత కాయకష్టంతో పనిచేసుకుని బతకాల్సిన చోట ‘పూటబత్తెమే పుల్లా వెలుగ’యిన ఘడియలలో– సామాన్యుల బతు కులు ఎలా కడతేరతాయి?! 

అందుకే గాంధీజీ 1920లకే అఖిల భారత కాంగ్రెస్‌ నిర్మాణ కార్యక్రమాలలో మద్యపాన నిషేధ సమస్యను భావి ప్రభుత్వాలకు ఉల్లంఘించరాని విధాన ‘ఫర్మానా’గా విడుదల చేయాల్సి వచ్చింది. కనుకనే 1948లో హిందూ మతోన్మాది గాడ్సే గుండుకు బలికావ డానికి ముందు ప్రార్థనా మందిర సమావేశంలో మాట్లాడుతూ గాంధీజీ ఇచ్చిన సందేశంలో ఇలా స్పష్టం చేశాడు: ‘మద్యం అనేది విషంకన్నా ప్రమాదం. విషం శరీరాన్ని మాత్రమే చంపేస్తుంది. కానీ మద్యం మనిషి ఆత్మనే నాశనం చేస్తుంది. కనుక ప్రభుత్వాలకు నా సలహా– మద్యం దుకాణాలన్నింటినీ చుప్తాగా మూసి పారేయండి. 

వాటిస్థానే మంచి తినుబండారాల షాపులను, కల్తీలేని తేలికైన ఆహార పదార్థాలున్న కొట్లను తెరిపించండి. తాగుడు మాన్పిస్తే కాయకష్టం చేసి బతికే కష్టజీవుల శరీర ఆరోగ్య శక్తి పెరుగుతుంది, నాలుగు డబ్బులు చేసుకునే శక్తీ పెరుగుతుంది. ఇప్పుడు స్వాతంత్య్రం పొందాం కాబట్టి మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని ప్రజల కిచ్చిన హామీని మనం నెరవేర్చాలి. ప్రజల్ని తాగుడుకి అలవాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే పాపకార్యం నుంచి వైదొలగాలి’ అయితే...
అందుకే అన్నాడేమో ప్రవక్త ఖలీల్‌ జిబ్రాన్‌: ‘ఆలయం పునాదిలో అట్టడుగున ఉన్న రాయి కన్నా/ గోపురంపై ఉన్న రాయి ఉన్నతమైనది కాదు సుమా’!!
-ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement