నిజామాబాద్ క్రైం: జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ మైదానం తో పోలీసులు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అం దులో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజర్వు ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్‌రావు పోలీసులతో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ చేయించారు.
ఆర్‌ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీం తో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుం టుందన్నారు. ప్రతి ఒక్కరు సంవత్సరంలో వందగంటల పాటు(వారానికి రెండు గంటలపాటు) చొప్పు న పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడానికి శ్రమదానం చేయాల న్నారు. ఇలా చేయటంవల్ల మహా త్మాగాంధీ 150వ జయంతి వరకైన ఆయన కలలు గన్న భారత దేశానికి కృషి చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు మల్లిఖార్జున్, ఆర్‌ఎస్సై మల్లిఖార్జున్‌గౌడ్, ఎఆర్‌ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, స్పెషల్‌పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ
Published Fri, Oct 3 2014 2:07 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement