గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు | Sonia Gandhi Modi, Others Pays Tribute to Mahatma Gandhi On His 152 Birth Anniversary | Sakshi
Sakshi News home page

Gandhi Jayanti 2021:మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు

Published Sat, Oct 2 2021 8:00 AM | Last Updated on Sun, Oct 3 2021 7:25 AM

Sonia Gandhi Modi, Others Pays Tribute to Mahatma Gandhi On His 152 Birth Anniversary - Sakshi

న్యూఢిల్లీ: నేడు భారత జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి. అహింసే ఆయుధంగా దేశం కోసం, ధర్మం కోసం శాంతి కోసం పోరాడిన బాపూజీ జీవన మార్గం ప్రతీ భారతీయుడికి అనుసరణీయం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనందరికి స్ఫూర్తిదాయకం.

గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశ నేతలు, ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. ఆయనతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్‌ షా గాంధీజీకి నివాళులు అర్పించారు. 

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాజ్‌ఘాట్‌ వద్ద జాతి పిత మహాత్మాగాంధీకి, విజయ్‌ ఘాట్‌ వద్ద ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement