
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని సీఎం పేర్కొన్నారు.
గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment