
చెన్నై,తిరువొత్తియూరు: పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి గాంధీ జయంతి రోజున విక్రయించిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అదే రోజు తూత్తుకుడి నగర్‌లోని ఓ వీధిలో మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదే రోజున మధ్యాహ్నం 12.30 గంటలకు ఎక్సైజ్ పోలీసులు అన్నానగర్ 7వ వీధిలో తనిఖీ చేయగా కారులో మద్యం బాటిల్స్ విక్రయిస్తున్నట్టు తెలిసింది. దీంతో అతన్ని పోలీసుల అరెస్టు చేశారు. విచారణలో అతను తూత్తుకుడి అన్నానగర్ 7వ వీధికి చెందిన పూసైదురై (42) అని.. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తెలిసింది. అతని వద్ద నుంచి 45 క్వార్టర్స్ బాటిల్స్, 72 హాఫ్ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment