చెన్నై, తిరువొత్తియూరు: మదురైలో మత్తు కోసం నిద్ర మాత్రలు కలిపిన పానియాన్ని కల్లు పేరుతో విక్రయించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా, కల్లు విక్రయాలు జోరందుకున్నాయి. మదురై కరుప్పాయి ఊరని వీరవంజన్ ఓడైపట్టి ప్రాంతంలో కల్లు విక్రయిస్తున్నట్టు కరుక్కూరని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్ స్పెక్టర్ మాడస్వామి బృందం గోమతిపురంలో రామ్‌కుమార్, శేఖర్, మణికంఠన్, ఈశ్వరన్‌ను అదుపులోకి తీసున్నారు. విచారణలో పులిసిపోయిన గంజి నీళ్లలో నిద్ర మాత్రలు కలిపి కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది.
వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిద్ర మాత్రలు కలిపిన 130 లీటర్ల నకిలీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. కూడల్ మదూర్ ప్రాంతంలో సందేహాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆనయూర్‌కు చెందిన శివరాజ్, లక్ష్మీ కాంతన్, జగన్ గుర్తించారు. వారు కల్లు విక్రయిస్తున్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు వారు ముగ్గురిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment