sleeping tablets
-
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్‌కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్‌తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్‌లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్‌ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్‌లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్‌లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్‌కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్‌లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. -
నిద్రమాత్రలు వాడుతున్నారా.. జర జాగ్రత్త!
నిద్రమాత్ర వేసుకోకపోతే ఆ రాత్రికి ఇక నిద్ర లేనట్లే అన్న పరిస్థితిలో చాలామంది తమకు తెలియకుండా నిద్రమాత్రలకు బానిసవుతుంటారు. ఈ మాత్రలు మెదడు, కేంద్ర నాడీవ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి, ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే ఎదురయ్యే సైడ్ఎఫెక్ట్స్ చాలా శక్తిమంతమైనవి. పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు, మెదడు పని చేయడానికి సహకరించక బద్దకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు అస్పష్టంగా మారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన అంతలోనే ఉద్వేగం వెంటనే ఆనందం ఇలా క్షణక్షణానికీ మారడం (మూడ్ స్వింగ్స్), జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం. నిద్రమాత్రలను వరుసగా రెండువారాలు వాడితే దేహం వాటికి అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత డోస్ పెంచాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నిద్రమాత్ర వేసుకోకపోతే మానసిక ఆందోళన, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రదశకు చేరితే మూత్రవిసర్జన కష్టం కావడం, ఇతర మూత్ర సంబంధ సమస్యలు, నోరు పొడిబారిపోవడం వంటి లక్షణాలకు దారి తీస్తుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడకాన్ని డాక్టర్లు ఎందుకు సూచిస్తారంటే... అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో తగుమాత్రం డోస్‌ను సూచిస్తారు. వాటి వాడకం ఆ సమస్య నుంచి బయటపడే వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ప్రిస్క్రిప్షన్‌లో నిద్రమాత్రలను రాసినట్లు తెలియనివ్వరు. తెలిస్తే ఎవరికి వారు తరచూ వాడి ఇతర సమస్యలు కొనితెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్త. -
బస్సులో పరిచయం, విటమిన్ ట్యాబ్లెట్లు అని నిద్రమాత్రలు
రాంగోపాల్‌పేట్: బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పరిచయం అయిన మహిళ ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి ఆమెకు నిద్రమాత్రలిచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. సనత్‌నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళ (36) ఎర్రగడ్డలో నివాసముంటోంది. గతంలో ఆమెకు బస్సులో ఓవ్యక్తి పరిచయమయ్యాడు.ఈ క్రమంలో ఇద్దరు తరచుగా ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ నెల 22న మహిళ ఇంటికి వచ్చి ఆమెతో కొద్దిసేపు ముచ్చటించాడు. తర్వాత విటమిన్ ట్యాబ్లెట్ అని నమ్మించి నిద్రమాత్రలు ఇచ్చాడు. మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. అదే అదనుగా ఇంట్లో ఉండే రెండు తులాల బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: మల్కాజిగిరిలో వ్యభిచార గృహంపై దాడి దిల్సుఖ్నగర్ ఏటీఎం లూటీ, మేనేజర్‌కు జైలు -
బాలికపై వృద్ధుని అకృత్యం, బాధితురాలు ఆత్మహ్యత్య
భోపాల్: వృద్ధుని చేతిలో అత్యాచారానికి గురైన బాలిక నిద్రమాత్రలు మింగి చనిపోయింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యారేమియా(68)అనే వ్యక్తి స్థానికంగా వార్తా పత్రిక నిర్వహిస్తున్నాడు. ఇతడు తన వద్ద పనిచేసే ఐదుగురు బాలికలపై పలు పర్యాయాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గత ఏడాది జూలైలో కేసు నమోదయింది. ఇతని బారిన పడిన బాలికలందరికీ స్థానిక షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాధితుల్లో ఇద్దరు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. అందులో ఒక బాలిక (17) మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని అనుమానిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె బుధవారం రాత్రి కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. ఘటనపై అధికారులు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నిందితుడైన ప్యారేమియాను జమ్మూకశ్మీర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన స్వీటీ విశ్వకర్మ(21)పై కేసు నమోదు చేశారు. గత ఏడాది జూలైలో అతని నివాసంలో జరిపిన సోదాల్లో ఖరీదైన కార్లు, మద్యం బాటిళ్లు, వన్యప్రాణుల ఎముకలు, పోర్న్ సీడీలు తదితరాలు లభించాయి. ప్యారే మియాపై ఐపీసీ, పోక్సో, అట్రాసిటీ, ఎక్సైజ్, వైల్డ్ లైఫ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. -
గొడవ పడి భార్య పుట్టింటికి వెళ్లిందని..!
సాక్షి, తవణంపల్లె: కుటంబ కలహాలతో ముగ్గురు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని నారసింహనపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం..గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు గిరిబాబు, బంగారుపాళ్యం మండలం దండువారిపల్లెకు చెందిన రమ్యకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా కుటుంబం కలహాల నేపథ్యంలో గిరిబాబు భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై మనస్తాపం చెందిన గిరిబాబు, తన తల్లి పద్మమ్మ, కుమారుడు జితేంద్రతో కలిసి ఇంటిలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో, గిరిబాబు తండ్రి మునెప్ప పొలం నుంచి ఉదయం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తట్టినా ఎవరూ తీయకపోవడంతో అనుమానించాడు. వెంటనే బంధువులు, గ్రామస్తులకు చెప్పాడు. వారు వచ్చి తలుపు పగులకొట్టి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితితో ఉండడంతో వెంటనే చిత్తూరు ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు.అక్కడ ముగ్గురూ కోలుకున్నారు. దీనిపై తవణంపల్లె పోలీసులను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. (చదవండి: రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్ రేట్) -
కల్లు పేరిట నిద్ర మాత్రలు కలిపి..
చెన్నై, తిరువొత్తియూరు: మదురైలో మత్తు కోసం నిద్ర మాత్రలు కలిపిన పానియాన్ని కల్లు పేరుతో విక్రయించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా, కల్లు విక్రయాలు జోరందుకున్నాయి. మదురై కరుప్పాయి ఊరని వీరవంజన్ ఓడైపట్టి ప్రాంతంలో కల్లు విక్రయిస్తున్నట్టు కరుక్కూరని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్ స్పెక్టర్ మాడస్వామి బృందం గోమతిపురంలో రామ్‌కుమార్, శేఖర్, మణికంఠన్, ఈశ్వరన్‌ను అదుపులోకి తీసున్నారు. విచారణలో పులిసిపోయిన గంజి నీళ్లలో నిద్ర మాత్రలు కలిపి కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిద్ర మాత్రలు కలిపిన 130 లీటర్ల నకిలీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. కూడల్ మదూర్ ప్రాంతంలో సందేహాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆనయూర్కు చెందిన శివరాజ్, లక్ష్మీ కాంతన్, జగన్ గుర్తించారు. వారు కల్లు విక్రయిస్తున్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు వారు ముగ్గురిని అరెస్టు చేశారు. -
నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి
ఆ బాలిక పేరు మానస. నిండా 13 ఏళ్లు కూడా లేవు. ఆమెకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ.. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. నిద్ర మత్తు ఆవహించే మందుల్ని కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో చెబితే.. తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి న్యూరాలజీ విభాగంలో చూపించగా.. అక్కడి స్లీప్ ల్యాబ్‌లో రాత్రంతా ఉంచి పరీక్షలు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే బాలిక నిద్రపోవటం లేదనే విషయాన్ని వైద్యులు నిర్థారించి.. కంటి నిద్ర రావటానికి వీలుగా తగిన సూచనలిచ్చారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. గుంటూరు (మెడికల్) సాధారణంగా వయసు మీరిన వారికి నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ.. చిన్న పిల్లలూ, యువకులు సైతం నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, స్మార్ట్ ఫోన్స్ యుగంలో ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తుండటం వల్ల పాఠశాల విద్యార్థి మొదలుకుని పెద్దవారి వరకు అనేక మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేనిపక్షంలో అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్). తొలి ఆస్పత్రిగా రికార్డు ‘మీకు నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి’ అని ఆహ్వానిస్తున్నారు అక్కడి వైద్యులు. నిద్ర పట్టకపోవటానికి గల కారణాలను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని హాయిగా నిద్రపోయేందుకు అవసరమైన వైద్యాన్ని జీజీహెచ్ డాక్టర్లు అందిస్తున్నారు. ఇక్కడి న్యూరాలజీ వైద్య విభాగంలో నిద్ర ప్రయోగ శాల (స్లీప్ ల్యాబ్)ను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ ల్యాబ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి రికార్డు సృష్టించింది. నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ నన్నపనేని వెంకయ్యచౌదరి ఇక్కడి ల్యాబ్‌కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు. నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చు తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని, నిద్రలో నడవడం, నిద్రలోనే సైకిల్ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్ రావడం వల్ల నిద్రపోవటానికి భయపడతారని వైద్యులు వివరిస్తున్నారు. రుగ్మతల నిర్ధారణకు స్లీప్‌ల్యాబ్ ఈ రుగ్మతలు రావడానికి గల కారణాలు నిర్ధారించేందుకు స్లీప్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. కొంతమంది రాత్రివేళలో నిద్రపోకుండా, పగటి పూట నిద్రిస్తుంటారు. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేకం ఉంటాయి. ఎలాంటి సమయాల్లో నిద్రపోవాలి, నిద్ర పోకపోతే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయనే విషయాలను స్లీప్ డిజార్డర్‌తో బాధపడేవారికి స్లీప్ ల్యాబ్‌లో వైద్య పరీక్షలు చేసి వివరిస్తున్నారు. నిద్రపట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను త్వరితగతిన సులభంగా నయం చేయవచ్చని, అందుకోసం స్లీప్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి తెలిపారు. పరీక్షల విధానం ఇలా.. ఒక్కో వ్యక్తికి వైద్య పరీక్ష చేసేందుకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది. ► సుమారు 30 నుంచి 40 వరకు వైర్లను శరీరంలోని వివిధ భాగాలకు అతికిస్తారు. ► రాత్రి వేళల్లో సహజ సిద్ధంగా నిద్రించే సమయంలో ఈ పరీక్ష నిర్వహించటం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ► ఇక్కడి ల్యాబ్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరీక్షలు చేస్తారు. – ఆస్పత్రి ఓపీ విభాగంలో మంగళ, గురు, శనివారం న్యూరాలజీ విభాగానికి వచ్చిన వారికి నిద్ర సమస్యలు ఉంటే స్లీప్ల్యాబ్లో పరీక్ష చేసి చికిత్స అందిస్తారు. ► వైద్య పరీక్షలు చేసే సమయంలో ప్రత్యేక శిక్షణ పొందిన న్యూరో టెక్నీషియన్‌తో పాటు ఒక డాక్టర్, రోగి అటెండెంట్ ఉంటారు. ► నిద్ర సమస్యలపై పరిశోధన చేసేందుకు ఒక పీజీ డాక్టర్‌ను ప్రత్యేకంగా నియమించారు. రెండేళ్లుగా ఉచిత పరీక్షలు స్లీప్‌ల్యాబ్‌ను 2017 జూలైలో ప్రారంభిం చినా వైద్య పరీక్షలు మాత్రం 2018 జనవరి నుంచి చేస్తున్నాం. 2018లో 47 మందికి, 2019 లో 40 మందికి స్లీప్ ల్యాబ్‌లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించాం. నిద్ర సమస్యలతో వచ్చే వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారు. 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు వారు కూడా నిద్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే నిద్రలేమి సమస్యలను నిర్ధారించే పాలిసోనోగ్రఫీ (పీసీజీ) పరీక్ష చేస్తున్నాం. సుమారు రూ.25 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షను న్యూరాలజీ విభాగంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి, విభాగాధిపతి, న్యూరాలజీ వైద్యం -
పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం, పెదబయలు : మండలంలో సీతగుంట పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న పి.కల్యాణి శుక్రవారం మధ్యాహ్నం సూసైడ్ నోట్ రాసుకుని, నిద్ర మాత్రలు మింగి, పెదబయలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలింది. ఎస్ఐ రామకృష్ణారావు స్థానిక నాయకుల సహకారంతో వెంటనే ఆమెను పెదబయలు పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. కొంతసేపటికి కోలుకున్న కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ కొంతకాలంగా ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ స్వామి తనను మానసికంగా వేధిస్తున్నాడని తెలిపారు. ఇటీవల తనకు వాహనంలో ప్రయాణం చేసే క్రమంలో కాలు బెణికి, ఆస్పత్రిలో చేరడం జరిగిందని, దీంతో ఒక్కరోజు సెలవు పెంచాలని కోరినా సెలవు మంజూరు చేయకుండా ఆబ్సెంట్ వేశారని, అంతేకాకుండా దీనిపై అనేక మార్లు సంజాయిషీ కోరుతూ మానసికంగా బాధపెడుతున్నాడని ఆరోపించారు. ఏడాది నుంచి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తానని, సర్వీసు రిజిష్టర్‌లో బాడ్గా రాస్తానని, సర్వీసు రిజిష్టర్ చింపివేస్తానని, నీ కారెక్టర్‌పై మచ్చపడేలా ప్రచారం చేస్తానని, తన కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలని మాటలతో హింసకు గురిచేస్తుండడంతో తాను మానసికంగా ఎంతో కుంగి చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తాం.. సీతగుంట పంచాయతీ కార్యదర్శి కల్యాణిని ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ స్వామి వేధిస్తున్నాడని, తన చావుకు అతనే కా>రణమని, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోలేదని అందువల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నానని నోట్లో ఉందని ఎస్ఐ రామకృష్ణారావు తెలిపారు. విచారణ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమేదు చేయడం జరుగుతుందని తెలిపారు. కాగా స్వామిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వోల సంఘం డివిజన్ అధ్యక్షుడు చెండా రమేష్‌కుమార్, స్థానిక జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని, సందడి కొండబాబు డిమాండ్ చేశారు. వేధింపులు సరికాదు గ్రామ స్థాయిలో పనిచేసే సీతగుంట పంచాయతీ కార్యదర్శి కళ్యాణిని సీనియర్ అసిస్టెంట్ వేధించడం దారుణం. కొంతకాలంగా స్వామి కార్యదర్శులతో ప్రవర్తించే తీరుపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – వి.చిరంజీవి, పంచాయతీ కార్యదర్శుల సంఘం డివిజన్ అధ్యక్షుడు ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు : ఎంపీడీవో ఈ విషయమై ఎంపీడీవో వసంతరావు నాయక్‌ను వివరణ కోరగా సీనియర్ అసిస్టెంట్ వేధిస్తున్నారని తనకు కార్యదర్శి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ ఆరోపణలపై సీనియర్ అసిస్టెంట్ స్వామిని వివరణ కోరగా తాను ఎవరినీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, తన వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించాలని తెలిపారు. -
కుటుంబ కలహాల నేపథ్యంలో..
– నిద్రమాత్రలు మింగి దంపతుల ఆత్మహత్యాయత్నం – భర్త పరిస్థితి విషమం.. – గుంటూరు తరలింపు కారంచేడు: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. భార్యను చీరాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుబుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. కారంచేడు పంచాయతీ కార్యాలయం ఎదురు రోడ్డులో బోయన నాగేశ్వరరావు, సుధారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఉదయం 10 గంటలైనా తలుపులు తెరవక పోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు చెరచి చూడటంతో ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందివ్వడంతో వారు వచ్చి చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు తీసుకెళ్లారు. సుధారాణి చీరాలలోనే చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి పూర్తి వివరాలు తెలియకున్నా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. -
పోలీసులు కొట్టారంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు(ప్రకాశం): పోలీసులు తనను అకారణంగా కొట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ... పట్టణానికి చెందిన అనిల్‌కుమార్‌కు భార్యతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తనను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారంటూ అనిల్ బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనే నిద్రమాత్రలు మింగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నిద్రమాత్రలు మింగి రైతు ఆత్మహత్యాయత్నం
గోపాలపురం మండలం కరికెర్లగూడెంలో వేముల పాపారావు(44) అనే పొగాకు రైతు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇటీవల వ్యవసాయంలో నష్టం వచ్చి పాపారావుకు రూ.15 లక్షల వరకు అప్పయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భర్త సినిమాకు తీసుకెళ్లలేదని... భార్య ఆత్మహత్య
బంజారాహిల్స్(హైదరాబాద్): పెళ్లికి ముందు సినిమాలకు, షికార్లకు తిప్పేవాడు.. అడిగిందల్లా కొనిచ్చేవాడు.. తీరా పెళ్లయిన తర్వాత..? సినిమాలు, షికార్లు లేవు.. ఏదైనా అడిగితే చీదరించుకోవడం... పీకలదాకా మద్యం తాగి వచ్చి కొట్టడం.. మొదలు పెట్టాడు. భర్త తీరుతో జీవితంపై విరక్తి చెందిన ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లాకు చెందిన పి. సుమలత(27) యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే సంతోష్‌కుమార్‌ను అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, ఆ దంపతుల మధ్య కలతలు తలెత్తి, అంతరం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1వ తేదీన సినిమాకు వెళ్దామని సుమలత భర్తను అడిగింది. తనకు తీరిక లేదని అతడు చెప్పడంతో.. రెండేళ్లుగా ఇదేమాట చెబుతున్నావంటూ వాగ్వాదానికి దిగింది. ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుమలతను సంతోష్ సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్నాడు. రెండు రోజులు గడిచినా అతడు రాకపోయేసరికి వైద్యులు బాధితురాలి సోదరుడు వినోద్‌కుమార్‌కు సమాచారం ఇచ్చాడు. ఈ నెల 2న వినోద్ ఆస్పత్రికి వచ్చి సోదరి పరిస్థితిని చూసి వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆమె ఆదివారం ఉదయం కన్నుమూసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పథకం ప్రకారమే.. భార్యను హత్య చేశా !
చిక్కడపల్లి/ ముషీరాబాద్, న్యూస్‌లైన్: బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో శనివారం జరిగిన రజని హత్య కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే భర్తే ఆమెను కడతేర్చాడని తేల్చారు. మద్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించి.. గాఢ నిద్రలో ఉండగా కర్కశంగా కత్తితో గొంతులో పొడిచి చంపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో భార్త, అత్తమామలతో పాటు మొత్తం ఆరుగురిని అరె స్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీధర్, డీఐ సుబ్బరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అచ్చయ్యనగర్‌లో ఉండే కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ కొడుకు బాలకృష్ణ బంజరాహిల్స్‌లోని కార్వే సంస్థలో బిజినెస్ మేనేజర్. ఇతనికి రజనితో 2004లో పెళ్లైంది. వీరికి కూతురు నిరుపమకృష్ణ (6) సంతానం. పెళ్లైనప్పటి నుంచి రజనికి అత్తమామలు, భర్తతో గొడవలు జరుగుతున్నాయి. సహోద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించిన రజని భర్తతో తరచూ ఘర్షణకు దిగేది. దీనికి తోడు మామ చిత్తరంజన్ తన కోరిక తీర్చమని ఆమెను వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో వేరే చోట కాపురముందామని రజని పట్టుపట్టగా భర్త ససేమిరా అనేవాడు. ఓ సందర్భంలో విడాకులిచ్చేందుకు బాలకృష్ణ సిద్ధంకాగా.. రజని నిరాకరించింది. ఈనేపథ్యంలోనే ఆమె అడ్డుతొలగించుకోవాలని భర్తతో పాటు అతని కుటుంబసభ్యులు పథకం పన్నారు. కత్తి, మద్యం, నిద్రమాత్రలు కొని... భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న బాలకృష్ణ శనివారం విధులు ముగించుకొని అమీర్‌పేట వెళ్లాడు. అక్కడ కత్తి, పూజా సామగ్రి కొన్నాడు. అనారోగ్యం కారణంగా అతని చెల్లెలు ప్రమీల నిద్రమాత్ర లు వాడేది. ఆ మందుల చీటీ చూపించి నాలుగు నిద్రమాత్రలు కొన్నాడు. ఇంటికి వస్తూ మార్గంమధ్యలో మద్యం బాటిల్ కొన్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే కూతుర్ని తన చెల్లెలు ఇంటికి పంపేశాడు. గతంలో బాలకృష్ణ, రజనిలు కలిసి మద్యం తాగేవారు. అదే మాదిరిగా మద్యం తాగుదామని భార్యను పిలిచాడు. ఇద్దరూ తాగారు. ఆమెకు తెలియకుండా ఆమె గ్యాస్‌లో నిద్రమాత్రల పొడిని వేశాడు. అది తాగిన రజని గాఢనిద్రలోకి వెళ్లగా.. అర్ధరాత్రి సమయంలో గొంతుపై కత్తితో బలంగా పొడవడంతో ప్రాణం విడిచింది. పక్క గదిలో ఉన్న అత్తమామలు ఈ దారుణాన్ని చూస్తూ ఉన్నారు. క్షుద్ర పూజల డ్రామా.. క్షుద్ర పూజల నాటకమాడి హత్య కేసు నుంచి తప్పించుకోవాలని బాలకృష్ణ ప్రయ త్నించాడు. బాల్కనీలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచాడు. ముంబైలో ఉండే రజని బంధువు రోగాలు, ఇతర సమస్యలతో బాధపడే వారికి పూజలు చేసి బాగు చేసేవాడని, రజని కూడా అలాంటి పూజ చేస్తుండగా అడ్డుకోబోగా కత్తి తగిలి చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. అయితే, ఆమె బొట్టు, కాళ్లపై ఉన్న పసుపు, కుంకుమ చెదిరిపోకుండా ఉండటంతో హత్య చేసిన తర్వాతే వాటిని చల్లారని పోలీసులు గుర్తించారు. నేనే చంపేశా... నేనే నా భార్యను హత్య చేశా. ఇంత జరుగుతుందని అనుకోలేదు. హత్య చేశాక డబ్బు ఖర్చు చేసి తేలిగ్గా కేసునుంచి బయటపడవచ్చని భావించా.. నా కూతురును బాగా చదివించాలనుకున్నా.. ఇలా కేసులో పూర్తిగా ఇరుక్కుపోతానని ఊహించలేదు. - బాలకృష్ణ, నిందితుడు దాడి చేస్తారని నిందితులను ప్రవేశపెట్టలేదు... సంచలనం సృష్టించిన రజనిని హత్య కేసులో నిందితులను ప్రవేశ పెడుతున్నారని తెలిసి మీడియం పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. అయితే పోలీసులు నిందితులను ప్రవేశ పెట్టలేదు. దీనిపై మీడియా ఏసీపీని వివరణ కోరగా... బాధితులు వారిపై దాడి చేస్తారనే భయంతోనే ప్రవేశ పెట్టలేదని చెప్పారు.