కుటుంబ కలహాల నేపథ్యంలో.. | family problems | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాల నేపథ్యంలో..

Published Thu, Sep 8 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

atmahatya

atmahatya

– నిద్రమాత్రలు మింగి దంపతుల ఆత్మహత్యాయత్నం
– భర్త పరిస్థితి విషమం.. 
–  గుంటూరు తరలింపు
కారంచేడు: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. భార్యను చీరాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుబుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. కారంచేడు పంచాయతీ కార్యాలయం ఎదురు రోడ్డులో బోయన నాగేశ్వరరావు, సుధారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఉదయం 10 గంటలైనా తలుపులు తెరవక పోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు చెరచి చూడటంతో ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందివ్వడంతో వారు వచ్చి చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు తీసుకెళ్లారు. సుధారాణి చీరాలలోనే చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి పూర్తి వివరాలు తెలియకున్నా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement