గొడవ పడి భార్య పుట్టింటికి వెళ్లిందని..! | Man Suicide Attempt Over Dispute With Wife In Chittoor | Sakshi
Sakshi News home page

గొడవ పడి భార్య పుట్టింటికి వెళ్లిందని..!

Dec 30 2020 8:15 AM | Updated on Dec 30 2020 8:15 AM

Man Suicide Attempt Over Dispute With Wife In Chittoor - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తవణంపల్లె: కుటంబ కలహాలతో ముగ్గురు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని నారసింహనపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం..గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు గిరిబాబు, బంగారుపాళ్యం మండలం దండువారిపల్లెకు చెందిన రమ్యకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా కుటుంబం కలహాల నేపథ్యంలో గిరిబాబు భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై మనస్తాపం చెందిన గిరిబాబు, తన తల్లి పద్మమ్మ, కుమారుడు జితేంద్రతో కలిసి ఇంటిలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో, గిరిబాబు తండ్రి మునెప్ప పొలం నుంచి ఉదయం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తట్టినా ఎవరూ తీయకపోవడంతో అనుమానించాడు. వెంటనే బంధువులు, గ్రామస్తులకు చెప్పాడు. వారు వచ్చి  తలుపు పగులకొట్టి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితితో ఉండడంతో వెంటనే చిత్తూరు ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు.అక్కడ ముగ్గురూ కోలుకున్నారు. దీనిపై తవణంపల్లె పోలీసులను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. (చదవండి: రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్‌ రేట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement