
సాక్షి, హైదరాబాద్: గాంధీ అంటే ఓ ఆదర్శమని, ఆయన జీవితం ఓ సిద్ధాంతమని ఏఐ సీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వ ర్యంలో చార్మినార్ నుంచి గాందీభవన్ వరకు బుధవారం శాంతి యాత్ర నిర్వహించారు. గాంధీభవన్ లో జరిగిన సభలో కుంతియా మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలతో స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment