- జిల్లాల వారీగా కుంతియా, భట్టి సమీక్ష
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు గురువారంతో గడువు ముగియనుండటంతో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క గాంధీభవన్‌లో బుధవారం ఈ అంశంపై జిల్లాల వారీగా సమీక్షించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల సభ్యత్వ నమోదు తీరును వారు పరిశీలించారు.
ఈ సమీక్షల్లో సీఎల్‌పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర నాయకులు డి.శ్రీనివాస్, కె.ఆర్.సురేశ్ రెడ్డి, పద్మా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భిక్షమయ్యగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, ఆకుల లలిత, తాహెర్, సి.జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో భట్టి మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో చేపట్టనున్న పాదయాత్రకు రైతులను సమీకరించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మే రెండో వారంలో పర్యటన ఉంటుం దని, తేదీ, ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.