సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు కృషి
-
జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్
కరీంనగర్ అర్బన్ : జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు అధికారులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో ఎస్.సూరజ్‌కుమార్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీల్లో చేపట్టాల్సిన పారిశుధ్య పక్షోత్సవాలు, స్వచ్ఛభారత్ మిషన్‌పై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూరజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రామసభలు నిర్వహించాలన్నారు. 3న గ్రామజ్యోతి కార్యాచరణ కమిటీలతో సమావేశం నిర్వహించి గ్రామాభివృద్ధి ప్రణాళికలపై చర్చించి ఆమోదించాలని చెప్పారు. 4న బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా కార్యాచరణ రూపొందించి మరుగుదొడ్డి లేని గృహాలను సర్వే ద్వారా గుర్తించి వంద శాతం నిర్మాణాలు చేపట్టాలని కోరారు. 5న రోడ్లను పరిశుభ్రం చేసి చెత్తాచెదారం, ముళ్ల పొదలు తొలగించాలన్నారు. 6న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 7న మురికి కాలువల పరిశుభ్రత, 8న ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, రక్షిత మంచినీటి పథకాల పరిశుభ్రత, 13న చేతుల పరిశుభ్రతపై పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. 14న మíß ళా ఆరోగ్య పారిశుధ్యంపై స్వశక్తి, గ్రామైక్య సంఘాలతో సమావేశాలు, అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 15న చేపట్టిన కార్యక్రమాలపై స్వచ్ పాఖ్‌వాడ సమీ„ý నిర్వహించి అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా పంచాయతీ అధికారికి పంపాలని సూచించారు. డివిజనల్ పంచాయతీ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, జిల్లా శిక్షణ మేనేజర్లు కోట సురేందర్, సంతోష్, విస్తరణాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.