సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి శాంతి సిద్ధాంతాన్ని పరిచయం చేసింది మహాత్మాగాంధీనేనని, నేడు ప్రపంచమంతా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తోంటే నేటి పాలకులు గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో ఇరువురి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి రేవంత్ ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం భద్రంగా, సుభిక్షంగా ఉండాలంటే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ముఖ్యనేతలు జి.నిరంజన్, కుమార్‌రావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment