
ఖైరతాబాద్: గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఖైరతాబాద్ నుంచి గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభిం చారు. పలు సామాజిక సంస్థల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ యాత్ర ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ప్రారంభమైంది. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, మారుతీ నగర్, బీజేఆర్ నగర్, మహాభారత్ నగర్, చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు స్వాతంత్య్రం కావాలా? స్వచ్ఛ భారత్ కావాలా? అన్నప్పుడు స్వాతంత్య్రం ఎలాగూ వస్తుంది, స్వచ్ఛ భారత్ కావాలన్న గాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే స్పూర్తితోనే ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment