litter
-
అలాంటి వాళ్లకు అదే సరైన శిక్ష: గడ్కరీ
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే.. గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నేను మారిపోయాను అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు. -
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
వందే భారత్ రైళ్లలో ఇది పరిస్థితి.. భారతీయ రైల్వేస్ రిక్వెస్ట్
Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు, మాగ్నటిక్ బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్ లాంటి సెమీ స్పీడ్ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. భారత్‌లో ఇప్పటిదాకా హైక్లాస్ రైలుగా వందే భారత్ ఓ ఫీట్ సాధించగా.. వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైలు కంపార్ట్మెంట్లో మొత్తం వాటర్ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ తన ట్విటర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. పైగా ‘వీ ద పీపుల్’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్ సెట్‌ను ఉదాహరించారాయన. “We The People.” Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa — Awanish Sharan (@AwanishSharan) January 28, 2023 ఆయన పోస్ట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్ సంస్థ వందేభారత్ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్‌తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్బిన్లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్. హైక్లాస్ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్ హోటల్లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్ కాక్‌పిట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్‌ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. -
మరో వివాదంలో కరణ్ జోహార్
పనాజీ: బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ సిబ్బంది గత వారం గోవాలోని ఓ గ్రామంలో షూటింగ్ చేశారు. ఈ క్రమంలో పోగయిన చెత్తని ఆ గ్రామంలో పడేసి వెళ్లారు. ఈ ఘటన ఉత్తర గోవా నిరుల్‌లో చోటు చేసుకుంది. ప్రాంత వాసులు తమ ఏరియాలో చెత్త పడేయటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా గోవా ప్రభుత్వం కరణ్ ధర్మ ప్రొడక్షన్స్‌కి నోటీసులు జారీ చేసింది. అలానే విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ధర్మ ప్రొడక్షన్స్ లైన్ ప్రొడ్యూసర్ దిలీప్ బోర్కర్‌కి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గోవా వ్యర్థ పదార్థాల నిర్వహణ మంత్రి మైఖేల్ లోబో మాట్లాడుతూ... ‘ధర్మ ప్రొడక్షన్స్ సిబ్బంది ఈ స్థలంలో చెత్త పడేసి తమ దారిన తాము పోయారు. శుభ్రం చేయలేదు. ఇందుకు గాను వారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఫేస్బుక్ ద్వారా తమ తప్పును ఒప్పుకోవాలి.. క్షమాపణలు కోరాలి. లేకపోతే వారికి జరిమానా విధిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చెత్తలో తారాగణం, సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు కూడా ఉన్నాయి. (చదవండి: మీడియాపై ఆగ్రహం.. కరణ్‌కు మద్దతు) ఇక ఈ సంఘటనపై లైన్స్ ప్రొడ్యూసర్ దిలీప్ బోర్కర్ స్పందించారు. ‘మేము నిరుల్ ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ చేశాం. ప్రతి రోజు చెత్తను సేకరించి స్థానిక పంచాయతీ తెలిపిన ప్రదేశంలో పడేసేవాళ్లం. కాంట్రాక్టర్ క్రమం తప్పకుండా చెత్తను సేకరిస్తాడు. కానీ ఆదివారం మాత్రం తీసుకెళ్లలేదు. దాంతో అది అక్కడే ఉంది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అని తెలిపాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోనె ప్రధాన పాత్రలో నటించిందని సమాచారం. -
మలబద్దకంతో బాధపడుతున్నాను.. తగ్గేదెలా?
నా వయసు 29 ఏళ్లు. నేను చాలాకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. స్వాభావికంగానే ఇది తగ్గే మార్గం చెప్పండి. మలబద్దకం ఉన్నవారిలో మలవిసర్జన అరుదుగా జరుగుతుంది. అప్పుడప్పుడూ మలబద్దకం రావడం చాలామందిలో కనిపించేదే. అయితే కొందరిలో ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది వారి దైనందిన కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతూ ఉంటుంది. పైగా దీర్ఘకాలిక మలబద్దకం ఉన్న వారు మలవిసర్జన సమయంలో చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మలబద్దకానికి అసలు కారణం తెలిస్తే దానికి అనుగుణమైన చికిత్స కానీ, జాగ్రత్తలు కానీ పాటిస్తే అది తగ్గిపోతుంది. ఉదాహరణకు కొంతమంది పీచు అంతగా లేని ఆహారం అంటే నిత్యం మాంసాహారం తింటూ ఉన్నప్పుడు, వారిలో పీచు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకునేలా చేస్తే మలబద్దకం తగ్గుతుంది. అయితే కొన్నిసార్లు మలబద్దకానికి అసలు కారణం తెలియకపోవచ్చు. కొందరిలో చిన్నతనంలో మలవిసర్జన శిక్షణ (గుడ్ శానిటరీ హ్యాబిట్స్) సరిగా లేకపోవడం వల్ల కూడా వారి యుక్తవయసులో దీర్ఘకాలిక మలబద్దకం రావచ్చు. మలబద్దకం ఉన్నట్లుగా గుర్తించే లక్షణాలివి: సాధారణం కంటే తక్కువ సార్లు మలవిసర్జనకు వెళ్లడం గడ్డలుగా లేక గట్టిగా ఉండే మలం మలవిసర్జన కోసం బాగా ముక్కాల్సి రావడం మలవిసర్జన ద్వారం వద్ద ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండి, అది మలవిసర్జన జరగకుండా ఆపుతున్నట్లుగా అనిపించడం మలవిసర్జనకు చాలా సమయం పట్టడం పొత్తికడుపును చేతులతో నొక్కాల్సి రావడం, కొన్నిసార్లు మలం బయటకు రావడానికి వేళ్లను ఉపయోగించాల్సి రావడం ∙ఒక్కోసారి మలం ఎంతకూ బయటకురాకపోవడంతో అది అక్కడ గట్టిపడి, ఎండిపోయి మరింత సమస్యాత్మకంగా మారడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. మలబద్దకం నుంచి విముక్తి కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: మలవిసర్జన ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని ఆపుకోకండి. టాయిలెట్లో గడపాల్సినంత సేపు గడపండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా, తొందరపడకుండా మల విసర్జనకు కావాల్సినంత సమయం కేటాయించండి. నీరు ఎక్కువగా తాగండి. దాంతో పాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోండి. మీ వైద్యుడు / డైటీషియన్ చెప్పినట్లుగా ఆహారంలో మార్పులు చేసుకోండి. మీ ఆహారంలో పీచు పదార్థాలు, పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పొట్టుతో ఉండే ముడి ధాన్యాల్లో పీచు ఎక్కువ. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. పాల ఉత్పత్తులు, మాంసాహారాలను చాలా పరిమితంగా తీసుకోండి. రోజులో మూడు సార్లు కాకుండా కొంచెం కొంచెం మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. కొద్దికొద్దిమోతాదుల్లో రోజులో 5 లేదా 6 సార్లు తినండి. రాత్రి భోజనం సమయంలో తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు వీలుగా నిద్రకు ఉపక్రమించడానికి కనీసం 3 లేదా 4 గంటల ముందే తినండి. పొగతాగే అలవాటును పూర్తిగా మానేయండి. మద్యాన్ని వదిలిపెట్టడం. కాఫీ/కెఫిన్ ఉండే ద్రవపదార్థాలకు దూరంగా ఉండండి. చ్యూయింగ్ గమ్ నమలకండి. రోజూ వ్యాయామం చేయండి. శారీరక కదలికల వల్ల పేగులు కూడా కదిలి మలబద్దకం నివారితమవ్వడమే కాకుండా, ఆరోగ్యపరంగా ఇతరత్రా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ టాయ్‌లెట్ సీట్ ఇలా ఉంటే మేలు భారతీయ టాయెలెట్లు మలబద్దకం ఉన్న వారికి ఒకింత మేలు చేస్తాయి. అయితే ఒకవేళ మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కారణాల వల్ల వెస్ట్రన్ టాయెలెట్లనే వాడాల్సి వస్తే కాళ్ల కింద ఒక పీట ఉంచుకొని ఈ కింద బొమ్మలోలా మీ శరీర భంగిమ ఉండేలా చూసుకోండి. మలబద్దకం నివారణకు ఇది కూడా చాలావరకు తోడ్పడుతుంది. ఫ్యాటీ లివర్ ఉందిజాగ్రత్తలేమిటి? నా వయసు 56 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. మన కాలేయం కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వుపదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది చాలా సంక్లిష్టమైన జీవక్రియల్లో ఒకటి. అందువల్ల ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది. మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా?
నా వయసు 66 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? – డి. సాయిప్రతాప్, ఏలూరు మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం – ఎక్కువ కాలం విరేచనాలు – వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం – ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం – మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట – చురుకుగా ఉండలేరు – చిరాకు, కోపం – విరేచనంలో రక్తం పడుతుంటుంది – కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఇలా జరుగుతోందేమిటి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ వూ బాబు వయస్సు పదకొండేళ్లు. వాడికి ఉన్న సమస్యతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం మలవిసర్జనకు వెళ్లినా సరే... స్కూల్ నుంచి వచ్చాక చూస్తే అండర్వేర్లో కొద్దిగా మల విసర్జన అయి కనిపిస్తుంది. స్కూల్ నుంచి వచ్చాక దుర్వాసన బాగా అనిపిస్తుంటే నిక్కర్ చూస్తే మలం అంటుకుని కనిపిస్తుంటుంది. మనం చెబితే గానీ నిక్కర్ మార్చడు. ఈ వయసులో వాడికి ఉన్న సమస్య నన్ను కుంగదీస్తోంది. మా అబ్బాయి విషయంలో తగిన పరిష్కారం చెప్పండి. – శ్రీలేఖ, రాజమండ్రి మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఎంకోప్రెసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన సవుస్య. చాలావుందిలో బయటకు చెప్పుకోకపోవచ్చు గానీ... దాదాపు 10% వుంది పిల్లల్లో ఈ సవుస్య ఉంటుంది. వుగపిల్లల్లో మరీ ఎక్కువ. ఇది మీ అబ్బాయి కావాలని చేస్తున్నది కాదు. దీర్ఘకాలిక వులబద్ధకం వల్ల క్రవుక్రవుంగా బవెల్ మీద నియంత్రణ పోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే వురికొన్ని అనటామికల్ (హిర్స్ప్రింగ్స్ డిసీజ్, యానల్ స్ఫింక్టర్ డిస్ఫంక్షన్ వంటి) సవుస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఉంటుంది. పిల్లల్లో ఈ సవుస్యలు ఉన్నాయేమో తెలుసుకోడానికి ఎక్స్‌రే, యానల్ వ్యూనోమెట్రీ వంటి కొన్ని పరీక్షలు అవసరం. ఏంకోప్రెసిస్ ఉన్న పిల్లలకు సావూజిక, ఉద్వేగభరిత (సోషల్, ఎమోషనల్) సవుస్యలు ఉంటాయి. వాళ్లలో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గి ఆత్మన్యూనత∙ పెరుగుతుంది. వాళ్లను వుందలించడం, తిట్టడం వంటివి చేస్తే సవుస్య వురింత జటిలం అవుతుంది. ఇదేదో పెద్ద సమస్య కాదని వాళ్లకు భరోసా ఇవ్వాలి. నిర్ణీత వేళల్లో వుల విసర్జనకు వెళ్లడం అలవాటు చేయాలి. అయితే వురీ ఒత్తిడి చేయవద్దు. ఆ పిల్లల్లో వులబద్ధకం ఎక్కువగా ఉండి మలం మలద్వారం వద్ద గట్టిగా ఉండలా వూరితే, అలాంటి పిల్లలను ఆస్పత్రిలో చేర్చి ఎనీవూ ద్వారా క్లీన్ చేయించాలి. ఇలాంటి పిల్లలకు రెగ్యులర్ బవెల్ హ్యాబిట్ ట్రైనింగ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు పిల్లలు సాఫీగా విసర్జన చేసేలా లాక్సెటివ్స్ ఇవ్వాలి. నీరు ఎక్కువగా తాగించాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నవాటిని ఇవ్వండి. నిరాశ పడాల్సిన అవసరం లేదు. బాబుకు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. తరచు కళ్లు తిరిగి పడిపోతున్నాడు... మా అబ్బాయికి ఏడేళ్లు. ఇటీవల రెండుసార్లు వాడు స్కూల్లో కళ్లు తిరిగిపడిపోయాడు. డాక్టర్‌కు చూపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మా ఫ్రెండ్స్‌లో కొందరు దీన్ని ఫిట్స్ తాలూకు లక్షణం కావచ్చని అంటున్నారు. మావాడిది దీర్ఘకాలిక సమస్యా? – కేశవరావు, కందుకూరు మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను సింకోప్ అనుకోవచ్చు. అంటే అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. నలభై శాతం మందికి జీవితకాలంలో ఎప్పుడో ఓసారి ఈ సమస్య ఎదురుకావచ్చు. పిల్లలు ఇలా పడిపోవడం అన్నది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయమే. ఇలా జరిగినప్పుడు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు అవసరం. సాధారణంగా కళ్లుతిరిగి పడిపోవడం (వేసోవ్యాగల్), గుండె సమస్యలు (లయ తప్పడం, అయోర్టిక్ స్టెనోసిస్), ఫిట్స్‌లో కొన్ని రకాలు, తీవ్రమైన నొప్పి వంటి అనేక కారణాలతో ఇలా జరగవచ్చు.అయితే మీ అబ్బాయి విషయంలో మామూలుగా కళ్లు తిరగడం (వేసోవ్యాగల్), ఒక్కసారిగా లేవగానే కళ్లు తిరగడం (ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్) వంటి కారణాలతో ఇది జరిగిందేమోనని భావించవచ్చు. మీరు ఒకసారి మీ పీడియాట్రిక్ నిపుణుడి ఆధ్వర్యంలో ఇందుకు కారణాలను కనుక్కోడానికి తగిన పరీక్షలు (ఈసీజీ, ఈఈజీ మొదలైనవి) చేయించాలి. ఇలాంటి పిల్లల విషయంలో ఎక్కువగా నీళ్లు తాగించడం, బిగుతుగా ఉండే దుస్తులు (ముఖ్యంగా మెడ వద్ద టైట్‌గా ఉన్నవి) తొడగకుండా ఉండటం మంచిది. పిల్లలను పడుకోబెట్టినప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చేయడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
భయం లేదు... సమస్య తగ్గుతుంది!
బాబు వయుస్సు పదకొండేళ్లు. ఈ వయసులో మలవిసర్జన సమయంలో వాడికి ఉన్న సమస్యతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం మలవిసర్జనకు వెళ్లినా సరే... స్కూల్ నుంచి వచ్చాక చూస్తే అండర్వేర్లో కొద్దిగా మల విసర్జన అయి కనిపిస్తుంది. స్కూల్ నుంచి వచ్చాక దుర్వాసన బాగా అనిపిస్తుంటే అప్పుడు నిక్కర్ చూస్తే మలం అంటుకుని కనిపిస్తుంటుంది. మనం చెబితే గానీ నిక్కర్ మార్చడు. ఈ వయసులో వాడికి ఉన్న సమస్యతో నన్ను కుంగదీస్తోంది. మా అబ్బాయి విషయంలో తగిన పరిష్కారం చెప్పండి. - సుమ, నెల్లూరు మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఎంకోప్రెసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన సవుస్య. చాలావుంది బయటకు చెప్పుకోకపోవచ్చు గానీ... దాదాపు 10% వుంది పిల్లల్లో ఈ సవుస్య ఉంటుంది. వుగపిల్లల్లో మరీ ఎక్కువ. ఇది మీ అబ్బారుు కావాలని చేస్తున్నది కాదు. దీర్ఘకాలిక వులబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్) వల్ల క్రవుక్రవుంగా బవెల్ మీద నియుంత్రణ పోవడంతో ఇలా జరుగుతుంది. దాంతోపాటు వురికొన్ని అనటామికల్ (హిర్స్ప్రింగ్స్ డిసీజ్, యూనల్ స్ఫింక్టర్ డిస్ఫంక్షన్ వంటి) సవుస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఉంటుంది. పిల్లల్లో ఈ సవుస్యలు ఉన్నాయేమో తెలుసుకోడానికి ఎక్స్‌రే, యూనల్ వ్యూనోమెట్రీ వంటి కొన్ని పరీక్షలు అవసరం. ఏంకోప్రెసిస్ ఉన్న పిల్లలకు సావూజిక, ఉద్వేగభరిత (సోషల్, ఎమోషనల్) సవుస్యలు ఉంటారుు. వాళ్లలో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గి ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. వాళ్లను వుందలించడం, వివుర్శించడం, తిట్టడం వంటివి చేస్తే సవుస్య వురింత జటిలం అయ్యే అవకాశం ఉంది. అలాంటి పిల్లలకు క్రవుం తప్పకుండా నిర్ణీత వేళల్లో వుల విసర్జనకు వెళ్లడం అలవాటు చేయూలి. అరుుతే ఆ ప్రక్రియులో వాళ్లను వురీ ఒత్తిడి చేయువద్దు. ఆ పిల్లల్లో వులబద్ధకం (కాన్స్టిపేషన్) చాలా ఎక్కువగా ఉండి మలం మలద్వారం వద్ద గట్టిగా ఉండలా వూరితే, అలాంటి పిల్లలను ఆసుపత్రిలో చేర్చి ఎనీవూ ద్వారా అంతా క్లీన్ చేరుుంచాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు రెగ్యులర్ బవెల్ హ్యాబిట్ ట్రైనింగ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతో పాటు పిల్లలు సాఫీగా విసర్జన చేసేలా లాక్సెటివ్స్ ఇవ్వడం వంటివి చేయూలి. నీరు ఎక్కువగా తాగించాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నవాటిని ఇవ్వండి. నిరాశ పడాల్సిన అవసరం లేదు. బాబు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. మైగ్రేన్‌కి మంచి మందులున్నాయి! నా వయసు 28 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. మైగ్రేన్ అని చెప్పారు. మందులు వాడితే తగ్గుతుందని అన్నారు. అయితే మళ్లీ తిరగబెట్టవచ్చని ఆందోళనగా ఉంది. హోమియోలో అయితే శాశ్వత పరిష్కారం ఉందని ఒక స్నేహితురాలు సలహా ఇచ్చింది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రవళి, విజయవాడ మైగ్రేన్ అనేది మెదడులో ఉండే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. దీనిలో మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల పరిమాణం వ్యాకోచించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. కారణాలు: మానసిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం హార్మోన్ల సమస్యలు అధిక వెలుతురు వాసనలు మత్తు పదార్థాలు, పొగాకు, పొగతాగడం, కాఫీ మహిళల్లో బహిష్టు ముందర లక్షణాలు రావచ్చు. లక్షణాలు: తలనొప్పి అధికంగా, తలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉండి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండవచ్చు నొప్పి సాధారణంగా నుదురు, కళ్ల చుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం, వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు తరచూ మైగ్రేన్ నొప్పిలో ఉంటాయి నిద్రలేమి, చిరాకు, నీరసం, ఉత్సాహాన్ని కోల్పోవడం, ఆవలింతలు, తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు మైగ్రేన్ సమస్యలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వీటినే మైగ్రేన్ ఆరా అంటారు. ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి. మైగ్రేన్ ఉన్న వారిలో కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగా కనిపించకపోవడం వంటి లక్షణాలు సైతం ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం తగినంత నిద్ర మద్యం, పొగతాగే అలవాట్లు మానుకోవాలి కొవ్వుపదార్థాలు, మాంసం, పప్పుదినుసులు, తలనొప్పి ఉన్నప్పుడు తగ్గించాలి తగినంత నీరు తాగాలి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి మానసిక ఒత్తిడికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. చికిత్స: ఈ సమస్యకు హోమియోలో సాంగ్వినేరియా, బ్రయోనియా, ఐరస్ వెర్స్, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్ వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. చీలమండ బెణికింది.. నొప్పి తగ్గేదెలా? ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పుడు ప్లాస్టర్ కాస్ట్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం గడిచాక కూడా నొప్పి ఎందుకు వస్తోంది? - సునీత, ఏలూరు మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి, లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు మీ కాలి చీలమండకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా వయసు 25 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. ఒక్కోసారి ఎంత నొప్పి ఉంటోందంటే దానిపై అస్సలు భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆదర్శ్, హైదరాబాద్ ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్-రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. నా వయసు 67 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - నాగేశ్వరి, గుంటూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. -
కదలని బాధ కాన్స్టిపేషన్
మలబద్ధకం ప్రతి ఉదయం మలవిసర్జన సాఫీగా అయితే... ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోయినట్టే. కానీ ఆ వేళ ‘ఆ ఒక్క పనీ’ జరగకుండా పేగులు మొరాయిస్తే అది నరకం. ఆ బాధ తగ్గించుకుని, ప్రశాంతత పొందేందుకు వివరాలివిగో... మనిషికి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో! మలవిసర్జన చేయడమూ అంతే అవసరం. ఆకలవుతోంది, భోజనానికి వెళ్తున్నానని చెప్పినంత సులువుగా వాష్రూమ్కెళ్లాలని చెప్పలేరు. కొంచెం బిడియం. మరికొంచెం సిగ్గు. దానికి తోడు ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ అవసరం తీరడానికి తగినన్ని సౌకర్యాలుండవు. దాంతో వాయిదా వేయక తప్పని పరిస్థితి. మోడరన్ లైఫ్స్టయిల్లో సౌకర్యాలు పెరిగాయి. దేహానికి వ్యాయామం లేకుండా గారంగా చూసుకోవడమూ ఎక్కువైంది. దేహం మీద ముద్దు ముదరడంతో మనిషిలో బద్ధకం పెరుగుతోంది. అది జీర్ణవ్యవస్థ, దాని అనుబంధ ప్రక్రియలు బద్ధకించేటట్లు చేస్తోంది. అది మలబద్ధకం రూపంలో బయటపడుతోంది. మరి... ఈ మలబద్ధకం నుంచి బయటపడేదెలాగ? మలబద్ధకం లక్షణాలు పెద్ద పేగు కదలికలు తగ్గడం, మలమూత్ర విసర్జనలో ఇబ్బందులు మలం గట్టి పడడం, పరిమాణం తక్కువగా ఉండడం మలవిసర్జన చేయాల్సినట్లు అనిపిస్తున్నా విసర్జించలేకపోవడం పొట్ట ఉబ్బిపోవడం, నొప్పి విసర్జన మందగించడంతో చిన్న పేగు, జీర్ణాశయం కదలికలు తగ్గడం, ఆహారం తినాలనిపించకపోవడం మలబద్ధకానికి కారణాలు! చిన్న పేగు, పెద్ద పేగు సమస్యలు, మలద్వారంలో ఇబ్బందులు మలబద్దకానికి ప్రధాన కారణాలవుతుంటాయి. అలాగే లైఫ్‌స్టయిల్ మారినందువల్ల దేహ కదలికలు, జీవక్రియలు మందగించి మలబద్ధకానికి దారి తీస్తోంది. లైఫ్‌స్టయిల్ మార్పు: ఆహారంలో తగినంత పీచు, ద్రవాలను తీసుకోకపోవడం. టైమ్ చూసుకుంటూ పరుగులు తీసే క్రమంలో దేహం మలవిసర్జన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసినప్పుడు వెళ్లకుండా వాయిదా వేయడమూ కారణమే. ఎక్కువమందికి పేగుల కదలికలకు అవసరమైనంత వ్యాయామం దేహానికి లేకపోవడం వల్ల ఇటీవల కాన్స్టిపేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మందులు: హైబీపీ, డిప్రెషన్, గుండెవ్యాధులకు మందులు వాడుతున్నప్పుడు దేహం కొద్దిపాటి సైడ్‌ఎఫెక్ట్స్‌కు లోనవుతుంది. ఆ మందులే కాకుండా బలం కోసం ఐరన్ మాత్రలు తీసుకుంటున్న వారిలోనూ మలబద్ధకం కనిపిస్తుంటుంది. క్రానిక్ ఇడియోపతిక్ కాన్స్టిపేషన్: కొందరికి ఏ ఇతర కారణాలూ లేకనే పేగు కదలికలు తక్కువగా ఉంటాయి. గర్భిణుల్లో: గర్భిణిగా ఉన్నప్పుడు దేహంలో వచ్చే అనేక మార్పుల్లో హార్మోన్ స్థాయుల హెచ్చుతగ్గులు ప్రధానమైనవి. ఈ మార్పు కొందరిలో పేగు కదలికలను మందగింప చేస్తుంది. దీనికి ఐరన్‌మాత్రల వాడకం తోడవుతుంటుంది. జీవక్రియల సమతుల్యత లోపించడం: హైపో థైరాయిడిజమ్, డయాబెటిక్ మెలిటస్ వంటి సమస్యలు కూడా కాన్స్టిపేషన్కు కారణమవుతుంటాయి. అనాటమికల్ ప్రాబ్లమ్: పైన చెప్పుకున్న కారణాలన్నీ చాలా చిన్నవి, పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నవి. కాగా అనాటమికల్ ప్రాబ్లమ్ మాత్రం పూర్తి స్థాయి చికిత్స అవసరమైన పరిస్థితి. ఇందులో రెక్టో కోయిల్, మెగా కోలన్ లేదా మెగా రెక్టమ్, నరాల సంబంధ వ్యాధులు, గాయాలవడం, కోలన్ క్యాన్సర్, కోలన్ స్ట్రిక్చర్ వంటి అనేక కారణాలుంటాయి. పెద్దపేగు మీద బుడిపెలాగ వచ్చి మలం అందులో ఆగిపోవడం, పెద్దపేగు సాగిపోవడం, పెద్దపేగు క్యాన్సర్ వంటివన్న మాట.కాన్ష్టిపేషన్ రావడానికి కారణాలు ఏమైనప్పటికీ గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోకపోతే నరాల వ్యవస్థ మీద దుష్ర్పభావం పడుతుంది. పైల్స్ వంటి అనుబంధ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. నిర్ధారణ ఎలా! కాన్స్టిపేషన్ రావడానికి కారణాల అన్వేషణ చాలా కీలకం. ప్రాథమికంగా లైఫ్‌స్టయిల్, మందుల వాడకంతో వచ్చిన సైడ్ఎఫెక్ట్స్ అనే కోణంలో విశ్లేషిస్తారు. అవి కాదనిపించినప్పుడు పూర్తిస్థాయి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవి... హిమోగ్లోబిన్ లెవెల్స్, ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, బయోకెమికల్ స్క్రీనింగ్, ధైరాయిడ్, సీరమ్ క్యాల్షియమ్, కొలనోస్కోపీ, ఫిజియోలాజికల్ టెస్ట్, మెజర్మెంట్ ఆఫ్ కొలోనిక్ ట్రాన్సిట్ టైమ్, యానోరెక్టల్ మానోమెట్రీ, బెలూన్ ఎక్స్పల్షన్ టెస్ట్‌లు అవసరమవుతాయి. చికిత్స మలబద్ధకం తగ్గడానికి మొదటగా లైఫ్‌స్టయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దేహాన్ని క్రమబద్ధంగా అలవాటు చేయాలి. మలవిసర్జన కోసం రోజూ ఒకే టైమ్‌లో కొంత సమయం కేటాయించాలి. ఆటలు, ఇతర వ్యాయామాలు పేగు కదలికలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి కనీసం అరగంట అయినా వ్యాయామం ఉండాలి. డ్రైవింగ్, కంప్యూటర్‌తో పని చేసే వారికి, ఇలాంటి కొన్ని రకాల వృత్తుల్లో ఎక్కువ సేపు కూర్చుని, దేహాన్ని పెద్దగా కదిలించే అవసరం ఉండదు. అలాంటి వారు తప్పని సరిగా వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించాలి ఆహారంలో ద్రవాల మోతాదు పెంచుకోవాలి. రోజుకు కనీసం పది గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్, శీతలపానీయాలు, కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారు వాటిని గణనీయంగా తగ్గించాలి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్‌గా కాన్స్టిపేషన్కు గురైన వాళ్లు ఆ సంగతిని డాక్టర్‌కి తెలియచేసి మందులు మార్చుకోవాలి. అలా మార్చడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆ మందులతోపాటు మలబద్ధకం తగ్గడానికి లాక్సేటివ్ మందులను సూచిస్తారు. ఈ లాక్సేటివ్లలో బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్, స్టిములెంట్ లాక్సేటివ్, ఆస్మోటిక్ లాక్సేటివ్స్ అని మూడు రకాలుంటాయి. రోగి పరిస్థితిని బట్టి ఏ రకమైన లాక్సేటివ్స్ అవసరమనేది డాక్టర్ నిర్ణయిస్తారు పై ఏ పద్ధతిలోనూ సమస్య పరిష్కారం కానప్పుడు బయో ఫీడ్‌బ్యాక్ విధానంలో చికిత్స చేస్తారు. హెల్త్ టిప్స్ బ్యాండెయిడ్ తొలగించండిలా! పిల్లలకు దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ తెరిచి బాండ్ ఎయిడ్ వేస్తారు. మరుసటి రోజుకి గాయం తగ్గుముఖం పడుతుంది. మూడో రోజుకి మానిపోతుంది. ఇక దానిని తీసేయాలి? అదే పెద్ద బాధ. గాయం నొప్పి రేగుతుంది, పిల్లలు గాయం నొప్పి కంటే ఈ నొప్పికే ఎక్కువ విలవిలలాడతారు. దానికి పరిష్కారం చాలా సులభం... బ్యాండ్ ఎయిడ్‌ను ఒక్కసారిగా లాగినట్లు తీయరాదు. బ్యాండ్ ఎయిడ్ చివరలో బేబీ ఆయిల్, కొబ్బరి నూనె రాయాలి. పది నిమిషాలకు నూనె పీల్చుకుంటూ అంచులు మెల్లగా చర్మాన్ని వదులుతాయి. అప్పుడు మరికొంత నూనె చర్మానికి రాస్తూ, బ్యాండ్ ఎయిడ్ని మెల్లగా కొద్ది కొద్దిగా వదులు చేస్తూ తీసేయాలి. లైఫ్‌స్టయిల్ కీళ్లనొప్పి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లవ్యాధి లక్షణాల్లో కీళ్ల నొప్పి. మోకాళ్లు, మడమల కీళ్లు, ఒళ్లంతా పట్టేసినట్లు కదలనివ్వకపోవడం (స్టిఫ్నెస్) వంటివి ఉంటాయి. వాటితోపాటు ఈ వ్యాధి లక్షణాలలో వేళ్ల కీళ్ల నొప్పి కూడా ఒకటి. వేళ్ల కీళ్ల నొప్పి అనిపించగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తమకు తాము నిర్ధారణకు రావడానికి వీల్లేదు. టైప్, కంప్యూటర్ కీబోర్డు విపరీతంగా ఉపయోగించేవారికి, పిండివంటలు, కుట్లు, అల్లికలు చేసేవారికి, బోర్డు మీద ఎక్కువగా రాసేవారికి కూడా వేళ్ల కీళ్లు నొప్పి పెట్టవచ్చు. ఇవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కావు. పైన చెప్పిన అలవాటు ఏదీ లేకుండా కూడా వేళ్ల కీళ్లు నొప్పెడుతుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని ఊహించాల్సిందే. అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే ఇది ఆ వ్యాధి తొలిలక్షణం... ముందస్తు హెచ్చరిక. -
సాఫీగా కావడం లేదు... సమస్య ఏంటి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఎండీ హుసేన్, కందుకూరు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ కాఫ్ వేరియంట్ ఆస్తమా తగ్గుతుందా? పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం కూడా ఉంటోంది. శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాం. కాఫ్ వేరియంట్ ఆస్తమా అన్నారు. మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి. - సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. డా॥రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
చెత్త వేస్తే జరిమానా
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇకపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కుదరదు. అలా చెత్త వేసేవారి నుంచి జరిమానా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘చెత్తపై సమరం’ పేరిట 100 రోజుల కార్యక్రమాన్ని రూపొందించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 25 నుంచే దీన్ని ప్రారంభించాలని భావించినా మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యమైంది. చెత్తరహిత ప్రాంతాల్లో చెత్త వేస్తే సదరు ప్రజల నుంచి ఎంత మొత్తంలో జరిమానా వసూలు చేయాలన్న వివరాలను అధికారులు స్పష్టం చేయలేదు. ఆ అధికారాన్ని మున్సిపాలిటీ కమిషనర్లకు వదిలేశారు. కాలనీలు, ఖాళీ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను సంబంధిత కాలనీలే తీసుకోవాలని, కాలనీ సంఘాలకు నోటీసులు జారీ చేయనున్నారు. 100 రోజుల కార్యక్రమాన్ని రూపొందించిన అధికారులు దాన్ని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు పంపించారు. ప్రతీరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల ఒకే తరహా కార్యక్రమాలు అమలు జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిని బాగా నిర్వహించే మున్సిపాలిటీలకు అవార్డులతోపాటు, ప్రోత్సాహాకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు పురపాలక పరిపాలనా కమిషనర్ జనార్దన్‌రెడ్డి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో ఏ,బీ,సీ,డీ గ్రేడ్ల వారీగా మున్సిపాలిటీలను గుర్తిస్తామని వెల్లడించారు. ఈ వంద రోజుల కార్యక్రమం అమలు తీరును పురపాలక పరిపాలనా కమిషనర్‌తోపాటు అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారని వెల్లడించారు.