భయం లేదు... సమస్య తగ్గుతుంది! | homeo patic councelling for health tips and sollutions | Sakshi
Sakshi News home page

భయం లేదు... సమస్య తగ్గుతుంది!

Published Thu, Dec 8 2016 11:40 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

భయం లేదు... సమస్య తగ్గుతుంది! - Sakshi

భయం లేదు... సమస్య తగ్గుతుంది!

బాబు వయుస్సు పదకొండేళ్లు. ఈ వయసులో మలవిసర్జన సమయంలో వాడికి ఉన్న సమస్యతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం మలవిసర్జనకు వెళ్లినా సరే... స్కూల్ నుంచి వచ్చాక చూస్తే అండర్‌వేర్‌లో కొద్దిగా మల విసర్జన అయి కనిపిస్తుంది. స్కూల్ నుంచి వచ్చాక దుర్వాసన బాగా అనిపిస్తుంటే అప్పుడు నిక్కర్ చూస్తే మలం అంటుకుని కనిపిస్తుంటుంది. మనం చెబితే గానీ నిక్కర్ మార్చడు. ఈ వయసులో వాడికి ఉన్న సమస్యతో నన్ను కుంగదీస్తోంది. మా అబ్బాయి విషయంలో తగిన పరిష్కారం చెప్పండి.
- సుమ,  నెల్లూరు

మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఎంకోప్రెసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన సవుస్య. చాలావుంది బయటకు చెప్పుకోకపోవచ్చు గానీ...  దాదాపు 10% వుంది పిల్లల్లో ఈ సవుస్య ఉంటుంది. వుగపిల్లల్లో మరీ ఎక్కువ. ఇది మీ అబ్బారుు కావాలని చేస్తున్నది కాదు. దీర్ఘకాలిక వులబద్ధకం (క్రానిక్ కాన్‌స్టిపేషన్) వల్ల క్రవుక్రవుంగా బవెల్ మీద నియుంత్రణ పోవడంతో ఇలా జరుగుతుంది. దాంతోపాటు వురికొన్ని అనటామికల్ (హిర్‌స్ప్రింగ్స్ డిసీజ్, యూనల్ స్ఫింక్టర్ డిస్‌ఫంక్షన్ వంటి) సవుస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఉంటుంది. పిల్లల్లో ఈ సవుస్యలు ఉన్నాయేమో తెలుసుకోడానికి ఎక్స్‌రే, యూనల్ వ్యూనోమెట్రీ వంటి కొన్ని పరీక్షలు అవసరం. ఏంకోప్రెసిస్ ఉన్న పిల్లలకు సావూజిక, ఉద్వేగభరిత (సోషల్, ఎమోషనల్) సవుస్యలు ఉంటారుు.

వాళ్లలో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గి ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. వాళ్లను వుందలించడం, వివుర్శించడం, తిట్టడం వంటివి చేస్తే సవుస్య వురింత జటిలం అయ్యే అవకాశం ఉంది. అలాంటి పిల్లలకు క్రవుం తప్పకుండా నిర్ణీత వేళల్లో వుల విసర్జనకు వెళ్లడం అలవాటు చేయూలి. అరుుతే ఆ ప్రక్రియులో వాళ్లను వురీ ఒత్తిడి చేయువద్దు. ఆ పిల్లల్లో వులబద్ధకం (కాన్‌స్టిపేషన్) చాలా ఎక్కువగా ఉండి మలం మలద్వారం వద్ద గట్టిగా ఉండలా వూరితే, అలాంటి పిల్లలను ఆసుపత్రిలో చేర్చి  ఎనీవూ ద్వారా అంతా క్లీన్ చేరుుంచాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు రెగ్యులర్ బవెల్ హ్యాబిట్ ట్రైనింగ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతో పాటు పిల్లలు సాఫీగా విసర్జన చేసేలా లాక్సెటివ్స్ ఇవ్వడం వంటివి చేయూలి. నీరు ఎక్కువగా తాగించాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నవాటిని ఇవ్వండి. నిరాశ పడాల్సిన అవసరం లేదు. బాబు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది.

 మైగ్రేన్‌కి మంచి మందులున్నాయి!
నా వయసు 28 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. మైగ్రేన్ అని చెప్పారు. మందులు వాడితే తగ్గుతుందని అన్నారు. అయితే మళ్లీ తిరగబెట్టవచ్చని ఆందోళనగా ఉంది. హోమియోలో అయితే శాశ్వత పరిష్కారం ఉందని ఒక స్నేహితురాలు సలహా ఇచ్చింది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రవళి, విజయవాడ

మైగ్రేన్ అనేది మెదడులో ఉండే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. దీనిలో మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల పరిమాణం వ్యాకోచించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది.

కారణాలు:  మానసిక ఒత్తిడి  నిద్రలేమి  ఉపవాసం  హార్మోన్ల సమస్యలు  అధిక వెలుతురు  వాసనలు  మత్తు పదార్థాలు, పొగాకు, పొగతాగడం, కాఫీ  మహిళల్లో బహిష్టు ముందర లక్షణాలు రావచ్చు.

లక్షణాలు:  తలనొప్పి అధికంగా, తలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉండి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండవచ్చు  నొప్పి సాధారణంగా నుదురు, కళ్ల చుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు  తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు  రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది  వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం, వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు తరచూ మైగ్రేన్ నొప్పిలో ఉంటాయి  నిద్రలేమి, చిరాకు, నీరసం, ఉత్సాహాన్ని కోల్పోవడం, ఆవలింతలు, తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు  మైగ్రేన్ సమస్యలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు.

వీటినే మైగ్రేన్ ఆరా అంటారు. ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి.  మైగ్రేన్ ఉన్న వారిలో కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు.  కొందరిలో పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగా కనిపించకపోవడం వంటి లక్షణాలు సైతం ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం  తగినంత నిద్ర  మద్యం, పొగతాగే అలవాట్లు మానుకోవాలి  కొవ్వుపదార్థాలు, మాంసం, పప్పుదినుసులు, తలనొప్పి ఉన్నప్పుడు తగ్గించాలి  తగినంత నీరు తాగాలి      జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి  మానసిక ఒత్తిడికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి.

చికిత్స: ఈ సమస్యకు హోమియోలో సాంగ్వినేరియా, బ్రయోనియా, ఐరస్ వెర్స్, నేట్రమ్‌మూర్, పల్సటిల్లా, నక్స్ వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి.

చీలమండ బెణికింది.. నొప్పి తగ్గేదెలా?
ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పుడు ప్లాస్టర్ కాస్ట్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం గడిచాక కూడా నొప్పి ఎందుకు వస్తోంది? - సునీత, ఏలూరు

మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి, లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు మీ కాలి చీలమండకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నా వయసు 25 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్‌లో నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. ఒక్కోసారి ఎంత నొప్పి ఉంటోందంటే దానిపై అస్సలు భారం వేయలేకపోతున్నాను. డాక్టర్‌గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆదర్శ్, హైదరాబాద్

ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్-రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో  భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి.

నా వయసు 67 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - నాగేశ్వరి, గుంటూరు

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అవసరమవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement