ఇలా జరుగుతోందేమిటి? | family health counsiling | Sakshi
Sakshi News home page

ఇలా జరుగుతోందేమిటి?

Published Tue, Dec 5 2017 12:11 AM | Last Updated on Tue, Dec 5 2017 8:33 AM

family health counsiling - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

వూ బాబు వయస్సు పదకొండేళ్లు. వాడికి ఉన్న సమస్యతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం మలవిసర్జనకు వెళ్లినా సరే... స్కూల్‌ నుంచి వచ్చాక చూస్తే అండర్‌వేర్‌లో కొద్దిగా మల విసర్జన అయి కనిపిస్తుంది. స్కూల్‌ నుంచి వచ్చాక దుర్వాసన బాగా అనిపిస్తుంటే నిక్కర్‌ చూస్తే మలం అంటుకుని కనిపిస్తుంటుంది. మనం చెబితే గానీ నిక్కర్‌ మార్చడు. ఈ వయసులో వాడికి ఉన్న సమస్య నన్ను కుంగదీస్తోంది. మా అబ్బాయి విషయంలో తగిన పరిష్కారం చెప్పండి. – శ్రీలేఖ, రాజమండ్రి
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఎంకోప్రెసిస్‌ అంటారు. ఇది చాలా సాధారణమైన సవుస్య. చాలావుందిలో బయటకు చెప్పుకోకపోవచ్చు గానీ...  దాదాపు 10% వుంది పిల్లల్లో ఈ సవుస్య ఉంటుంది. వుగపిల్లల్లో మరీ ఎక్కువ. ఇది మీ అబ్బాయి కావాలని చేస్తున్నది కాదు. దీర్ఘకాలిక వులబద్ధకం వల్ల క్రవుక్రవుంగా బవెల్‌ మీద నియంత్రణ పోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే వురికొన్ని అనటామికల్‌ (హిర్‌స్ప్రింగ్స్‌ డిసీజ్, యానల్‌ స్ఫింక్టర్‌ డిస్‌ఫంక్షన్‌ వంటి) సవుస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఉంటుంది. పిల్లల్లో ఈ సవుస్యలు ఉన్నాయేమో తెలుసుకోడానికి ఎక్స్‌రే, యానల్‌ వ్యూనోమెట్రీ వంటి కొన్ని పరీక్షలు అవసరం. ఏంకోప్రెసిస్‌ ఉన్న పిల్లలకు సావూజిక, ఉద్వేగభరిత (సోషల్, ఎమోషనల్‌) సవుస్యలు ఉంటాయి. వాళ్లలో సెల్ఫ్‌ ఎస్టీమ్‌ తగ్గి ఆత్మన్యూనత∙ పెరుగుతుంది. వాళ్లను వుందలించడం, తిట్టడం వంటివి చేస్తే సవుస్య వురింత జటిలం అవుతుంది. ఇదేదో పెద్ద సమస్య కాదని వాళ్లకు భరోసా ఇవ్వాలి. నిర్ణీత వేళల్లో వుల విసర్జనకు వెళ్లడం అలవాటు చేయాలి. అయితే వురీ ఒత్తిడి చేయవద్దు. ఆ పిల్లల్లో వులబద్ధకం  ఎక్కువగా ఉండి మలం మలద్వారం వద్ద గట్టిగా ఉండలా వూరితే, అలాంటి పిల్లలను ఆస్పత్రిలో చేర్చి ఎనీవూ ద్వారా క్లీన్‌ చేయించాలి. ఇలాంటి పిల్లలకు రెగ్యులర్‌ బవెల్‌ హ్యాబిట్‌ ట్రైనింగ్‌ వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు పిల్లలు సాఫీగా విసర్జన చేసేలా లాక్సెటివ్స్‌ ఇవ్వాలి. నీరు ఎక్కువగా తాగించాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నవాటిని ఇవ్వండి. నిరాశ పడాల్సిన అవసరం లేదు. బాబుకు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది.

తరచు కళ్లు తిరిగి పడిపోతున్నాడు...

మా అబ్బాయికి ఏడేళ్లు. ఇటీవల రెండుసార్లు వాడు స్కూల్లో కళ్లు తిరిగిపడిపోయాడు. డాక్టర్‌కు చూపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మా ఫ్రెండ్స్‌లో కొందరు దీన్ని ఫిట్స్‌ తాలూకు లక్షణం కావచ్చని అంటున్నారు. మావాడిది దీర్ఘకాలిక సమస్యా?     – కేశవరావు, కందుకూరు
మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను సింకోప్‌ అనుకోవచ్చు. అంటే  అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. నలభై శాతం మందికి జీవితకాలంలో ఎప్పుడో ఓసారి ఈ సమస్య ఎదురుకావచ్చు. పిల్లలు ఇలా పడిపోవడం అన్నది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయమే. ఇలా జరిగినప్పుడు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు అవసరం. సాధారణంగా కళ్లుతిరిగి పడిపోవడం (వేసోవ్యాగల్‌), గుండె సమస్యలు (లయ తప్పడం, అయోర్టిక్‌ స్టెనోసిస్‌), ఫిట్స్‌లో కొన్ని రకాలు, తీవ్రమైన నొప్పి వంటి అనేక కారణాలతో ఇలా జరగవచ్చు.అయితే మీ అబ్బాయి విషయంలో మామూలుగా కళ్లు తిరగడం (వేసోవ్యాగల్‌), ఒక్కసారిగా లేవగానే కళ్లు తిరగడం (ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌) వంటి కారణాలతో ఇది జరిగిందేమోనని భావించవచ్చు. మీరు ఒకసారి మీ పీడియాట్రిక్‌ నిపుణుడి ఆధ్వర్యంలో ఇందుకు కారణాలను కనుక్కోడానికి తగిన పరీక్షలు (ఈసీజీ, ఈఈజీ మొదలైనవి) చేయించాలి. ఇలాంటి పిల్లల విషయంలో ఎక్కువగా నీళ్లు తాగించడం, బిగుతుగా ఉండే దుస్తులు (ముఖ్యంగా మెడ వద్ద టైట్‌గా ఉన్నవి) తొడగకుండా ఉండటం మంచిది. పిల్లలను పడుకోబెట్టినప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చేయడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement