స్వచ్ఛభారత్కు కపిల్, గంగూలీని నామినేట్ చేసిన మోదీ | narendra modi nominates kapil sharma, saurav ganguly for swachch bharat | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్కు కపిల్, గంగూలీని నామినేట్ చేసిన మోదీ

Published Thu, Dec 25 2014 2:55 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

స్వచ్ఛభారత్కు కపిల్, గంగూలీని నామినేట్ చేసిన మోదీ - Sakshi

స్వచ్ఛభారత్కు కపిల్, గంగూలీని నామినేట్ చేసిన మోదీ

గాంధీ జయంతి రోజున తాను ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వారణాసి పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ ఈసారి మరింతమందిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేశారు. ప్రధానంగా ముంబై డబ్బావాలాలను, క్రికెట్ యువరాజు సౌరవ్ గంగూలీని కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మను, కిరణ్ బేడీని ఆయన ఈసారి ప్రస్తావించారు. వాళ్లతో పాటు నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, సోనాల్ మాన్సింగ్, రామోజీరావు, ఆరోన్ పూరీ, ఐసీఏఐ.. ఇలా వ్యక్తులతో పాటు సంస్థలు, సమూహాలను కూడా ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నామినేట్ చేశారు.

అంతకుముందు వారణాసి శివార్లలోని బాబత్పూర్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగారు. అక్కడ ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్ర మంత్రి అహ్మద్ హసన్ తదితరులు స్వాగతం పలికారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు, హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పేయి తదితరులు కూడా ప్రధాని పర్యటనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement