1/14
దిగ్గజ గాయని పి.సుశీల పుట్టినరోజు నేడు (నవంబర్ 13). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
2/14
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో 1935లో పుట్టి పెరిగింది పులపాక సుశీల
3/14
1950లో రేడియోలో నిర్వహించిన పోటీలో పాల్గొని సంగీత ప్రస్థానం మొదలుపెట్టింది
4/14
AM రాజాతో 'కన్నతల్లి' అనే తెలుగు సినిమాలో పాట పాడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది
5/14
ఇప్పటివరకు ఈమె దాదాపు 50 వేల పైచిలుకు పాటలు పాడటం విశేషం
6/14
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ భాషల్లో ఈమె పాడింది
7/14
పెళ్ళి చేసి చూడు, పిచ్చి పుల్లయ్య, మిస్సమ్మ, బాలనాగమ్మ, మాయా బజార్.. ఇలా చెప్పుకుంటూ పోతే పాటల లిస్ట్ చాలా పెద్దదే
8/14
ప్రాంతీయ అవార్డులు, జాతీయ అవార్డులని సైతం ఈమె తన పాటలతో సొంతం చేసుకున్నారు
9/14
ఇలా ఇప్పటికీ తన పాటలతో అలరిస్తున్న పి.సుశీల.. ఒక్క పాట విషయంలో తెగ బాధపడుతుంటారు
10/14
ఎన్టీఆర్ 'డ్రైవర్ రాముడు' మూవీలో "గ్గుగ్గుగ్గగుడెసుందీ మ‍్మమ్మమ మంచముందీ'' అనే పాట ఉంది
11/14
ఈ సాంగ్ పాడిన తర్వాత ఎందుకు పాడానా అని చాన్నాళ్ల పాటు సుశీల చాలా బాధపడ్డారట
12/14
ఈ ఏడాది ఆగస్టులో సుశీల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అభిమానులు భయపడ్డారు కానీ కోలుకుని తిరిగి మామూలు మనిషైపోయారు
13/14
88 ఏళ్లు పూర్తి చేసుకున్న సుశీలమ్మ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్
14/14