తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ శంకరాభరణం రిలీజ్ రోజే శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన చివరి క్షణాల వరకూ కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి ముందు ఓ పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్ రాస్తూ.. కాసేపటికి దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా కె.విశ్వనాథ్.. సాగరసంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను చిత్రపరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రహీరోలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన కృషికి గానూ 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment