లారీని ఢీకొన్న బస్సు
Published Wed, Aug 21 2013 3:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ప్యారిస్, న్యూస్‌లైన్: సేలంలో ఉప్పులోడుతో వెళుతున్న లారీని ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్ మృతి చెందాడు. డ్రైవర్‌తో సహా పది మంది గాయాలపాలయ్యారు. సేలం సమీపంలో మంగళవారం వేకువజామున ఉప్పు లోడును ఎక్కించుకుని వస్తున్న లారీ, నాగపట్నం నుంచి సేలంకు వస్తున్న ప్రభుత్వ బస్సును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కండెక్టర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్‌తో సహా పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వివరాలు.. నాగపట్టణం నుంచి సేలంకు సోమవారం రాత్రి ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సు బయల్దేరింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
బస్సు వేకువజామున 3.30 గంటలకు సేలం సమీపంలోని పల్లూర్ బైపాస్ రోడ్డు వంతెనపై వస్తుండగా ముందు వైపు తూత్తుకుడి నుంచి మేట్టూరుకు ఉప్పు లోడుతో వెళుతున్న లారీ బస్సును ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు పెద్దపెట్టున కేకలు పెట్టారు. ముందు సీట్‌లో కూర్చుని ఉన్న కండక్టర్ నాగపట్నం తిరుకువలైకు చెందిన శివపుణ్యం (52) మృతి చెందాడు. బస్సు డ్రైవర్ మైలాడుదురైకు చెందిన దిల్‌కుమార్ (36), శివగంగైలోని పుదువలైకు చెందిన శక్తివేల్ (48), పులిపాండి కొంబై మలయాండి (33), సేలం కొండలాంపట్టి పరమశివం (30), తిరుచ్చి పెరంబలూర్ రాజమాణిక్యం వివేక్ (29), తిరుపత్తూర్ కుమార్ (18), పట్టుకోట్టై స్టాలిన్ (31), పుదుకోట్టై రాజేంద్రన్ (30)లతో సహా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సేలం పోలీసులు కేసు నమోదుచేశారు.
Advertisement
Advertisement