ప్లస్‌టూ విద్యార్థి ఆత్మహత్య
Published Mon, Jan 6 2014 3:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
సేలం, న్యూస్‌లైన్:ప్లస్‌టూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కేసులో పాఠశాల కరెస్పాండెంట్ సహా ఐదుగురిని నామక్కల్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నామక్కల్‌లో కురింజి మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఇందులో మదురైకు చెందిన వెంకటేశన్ (17), ప్లస్‌టూ చదువుతున్నాడు. శనివారం ఉదయం వెంకటేశన్ బస చేసి ఉన్న హాస్టల్‌లో ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీ సులు పంచనామా నిమిత్తం వెంకటేశన్ మృత దేహాన్ని నామక్కల్ జీహెచ్ కు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు జీహెచ్‌కు వచ్చిన వెంకటేశన్ తల్లిదండ్రులు కళాశాల నిర్వాహకులే హత్య చేశారని ఆరోపించారు.
ఆ సమయంలో వెంకటేశన్ అన్న శివ చిదంబరం మాట్లాడుతూ కొత్త సంవత్సరాది సందర్భంగా వెంకటేశన్ టీచర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కారణంగా పాఠశాల నిర్వాహకులే హత్య చేసినట్లు వెంకటేశన్ స్నేహితులు ఫోన్‌లో తమకు తెలిపినట్లు చెప్పాడు. అంతేకాకుండా వెంకటేశన్ భౌతికకాయానికి పోస్టుమార్టం నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేయరాదని, మదురై ఆస్పత్రిలో చేయిస్తామని తెలి పారు. అనంతరం వెంకటేశన్ తండ్రి శ్రీనివాసన్ నామక్కల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి పాఠశాల కరెస్పాండెంట్ తం గవేల్‌తో సహా ఐదుగురు తన కుమారుడిని హత్య చేసినట్టు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టా రు. అనంతరం నామక్కల్ పోలీసులు అర్ధరాత్రి 302 సెక్షన్ కింద పాఠశాల కరెస్పాండెంట్ తంగవేల్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి వెంకటేశన్ మృత దేహానికి నామక్కల్ జీహెచ్‌లోని పోస్టుమార్టం నిర్వహించారు.
Advertisement