Venkatesan
-
విత్తన కష్టం తీరనుందా?
రైతు ఎదుర్కొంటున్న అనేకానేక కష్టాల్లో నాణ్యమైన విత్తనం దొరకడం ఒకటన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పండిన పంట నుంచే మరుసటి పంటకు విత్తనాలను సేకరించేవారుగానీ.. దీనివల్ల దిగుబడులు క్రమేపీ తగ్గేవి. పైగా చీడపీడల బాధ కూడా ఎక్కుయ్యేది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. మాత పంటకు అచ్చమైన నకలుగా విత్తనం కూడా ఉండేలా చేసేందుకు వీరు ఒక పద్ధతిని కనుక్కున్నారు. ఫలితంగా ఏటా హైబ్రిడ్ విత్తనాల కోసం రైతులు శ్రమపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అధిక దిగుబడులనిచ్చే.. చీడపీడలను, వాతావరణ మార్పులను కూడా తట్టుకోగల వంగడాలను వేగంగా ప్రపంచం నలుమూలలకు విస్తరించేందుకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త వెంకటేశన్ సుందరేశన్ తెలిపారు. ప్రస్తుతం తాము వరి మొక్కలోని ప్రత్యేక జన్యువును గుర్తించామని.. దీంట్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కణ విభజన ప్రక్రియలో భాగంగానే విత్తనాలు కూడా ఏర్పడేలా చేశామని వివరించారు. ఫలితంగా ఫలదీకరణ అన్నది లేకుండానే విత్తనాలు పుట్టుకొస్తాయని తెలిపారు. వరితోపాటు పప్పు ధాన్యాల మొక్కల్లోనూ ఈ జన్యువు ఉంటుంది కాబట్టి.. వాటిల్లోనూ తల్లి మొక్కను పోలిన విత్తనాలు వృద్ధి చేసేందుకు అవకాశముందని సుందరేశన్ తెలిపారు. -
షార్‌లోకి చొరబడ్డ తమిళనాడు వ్యక్తి.. అరెస్ట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో శనివారం ఎలాంటి అనుమతి లేకుండా మూలస్థానేశ్వరస్వామి ఆలయం సమీపంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తచ్చాడుతూ భద్రతా సిబ్బందికి కనిపించాడు. తమిళనాడు సేలంకు చెందిన వెంకటేశన్ అనే వ్యక్తిని సీఐఎస్ఎప్ భద్రతా సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడకు ఎందుకొచ్చావ్ అని అతడ్ని భద్రతా సిబ్బంది, పోలీసులు ప్రశ్నించగా ఇక్కడ చేపల విక్రయాలు చేస్తుండడం చూశానని, తనకు చేపలు పట్టడం వచ్చినందున పులికాట్ జాలర్లతో తీరప్రాంతానికి చేరుకున్నాని తెలిపాడు. కొంతమంది జాలర్లతో కలసి పడవలో ఎక్కి బకింగ్ హాం కెనాల్ చేరుకున్నానని పేర్కొన్నాడు. అతను చెప్పిన కథనమంతా నమ్మశక్యంగా లేకపోవడంతో ఇన్చార్జి సీఐ అక్కేశ్వరరావు, శ్రీహరికోట ఎస్సై విజయ్‌కుమార్, షార్ భద్రతా సిబ్బంది, షార్ ఇంటిలిజెన్స్ సిబ్బంది కలిసి వెంకటేశన్‌ను తీసుకుని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. షార్‌లోకి ఎలా చొరబడ్డాడు? అనే విషయంపై విచారణ చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి హిందీ, తమిళం మాట్లాడటం, అన్ని తెలిసిన వ్యక్తిగా ఉండడంతో లోతుగా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారించాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
పండగ పూట విషాదం
పిల్లలు లేని ఆ దంపతులు ఓ బాబును దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెరిగి పెద్దవాడవడంతో ఆశలన్నీ అతడిపైనే పెట్టుకుని బతుకుతున్నారు. త్వరలో అతడికి పెళ్లి చేద్దామనుకున్నారు. ఇందుకోసం సొంత ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. దత్తపుత్రుడి అకాల మరణంతో ఆ తల్లిదండ్రులకు గుండెకోతే మిగిలింది. ఉగాది పండగను ఎంతో సరదాగా చేసుకోవాల్సిన కుటుంబంలో విషాదం అలుముకుంది. లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... లావేరు: లావేరులోని వస్త్రపురి కాలనీకి చెందిన లంకపల్లి వెంకటేష్(24) గురువారం రోడ్డు ప్రమదాంలో మృతి చెందాడు. వెంకటేషన్ రణస్థలం మండలంలోని పైడిభీమవరంలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డ్యూటీ కి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మండలంలోని బొడ్డపాడు సమీపంలో లావేరు నుంచి సుభద్రాపురం వైపు వస్తున్న మహేంద్ర లగే జీ వాహనం ఢీకొంది. దీంతో వెంకటేష్ ఎగిరిపడి రోడ్డు పక్కనున్న రాయిపై పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు, తర్వాత విశాఖకు తరలిస్తుండగా మార్గంమధ్యలో అంబులెన్సులోనే మృతి చెందాడు. లావేరు ఎస్ఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్నిపోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. తల్లిదండ్రులకు గుండెకోత పెంచుకున్న కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో లంకలపల్లి సత్యన్నారాయణ, నారాయణమ్మ దంపతులు బోరున విలపిస్తున్నారు. వెంకటేష్‌కు త్వరలోనే పెళ్లి చేద్దామని కొత్తగా వస్త్రపురి కాలనీలో ఇళ్లు కూడా కడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొడుకు మృతి చెందడంతో ఇక తమకు దిక్కెవరంటూ తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడం వల్లే... లావేరులోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి బొడ్డపాడు సమీపం వరకూ సింగిల్ బీటీ రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు పక్క మట్టి బెర్ములు పాడై గోతులమయమయ్యాయి. ఎదురురెదురుగా వాహనాలు వస్తే రోడ్డు దిగడం కుదరదు. ఒక వేళ అలాంటి ప్రయత్నం చేస్తే వాహనాలు బోల్తా పడతాయి. ఇదేవిధంగా వెంకటేష్ రోడ్డు దిగలేకపోవడంతో వాహన ఢీకొని మృతి చెందాడు. మట్టి బెర్ములు పాడై సంవత్సరాలు తరబడినా వాటికి మరమ్మతులు చేయకుండా ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం బలైపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
‘పోలీసు హౌసింగ్’ చైర్మన్‌గా వెంకటేశన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశన్, డెరైక్టర్లుగా డీజీపీ, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జేఏండీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొత్త కంపెనీని రిజిస్టర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా హోంశాఖ కార్యదర్శి వెంకటేశన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వానర ప్రేమికుడు
జీవ దయ కోతులను చూసి భయపడడమో, భయపెట్టడమో, వాటిని అల్లరి పెట్టడమో చాలా మంది చేసే పని. ఆ యువకుడు మాత్రం కోతిచేష్టల వైపు కాదు కోతుల కష్టాల వైపు దృష్టి సారించాడు. అవి ఆకలితో ఉన్నా, గాయపడినా, ఏ కష్టంలో ఉన్నా... వాటి గురించి ఆలోచించడమే కాదు అండగా నిలబడుతున్నాడు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పిడబ్ల్యూడి అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్ ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. నీలమేఘం పూండి రిజర్వాయర్ దగ్గర ఉద్యోగం చేసేవాడు. ఆయనకు భోజనం తీసుకు వెళ్ళే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న కష్టాలు వెంకటేశన్‌ను కంటతడి పెట్టించాయి. ‘మూడు వేల మందికి పైగా ప్రజలు నివాసం వుంటున్న ప్రాంతంలో కనీసం యాభై వానరాలకు తిండి పెట్టలేరా?’ అని మనసులో బాధ పడ్డాడు. రోజుకు కనీసం వంద రూపాయల వరకు ఖర్చు పెట్టి వాటి ఆకలి ఎంతో కొంత తీర్చేవాడు. అయినా ఎక్కడో అసంతృప్తి. ఇది సరిపోదని... రోజుకు కనీసం 50 కోతుల ఆకలి అయినా తీర్చాలనుకున్నాడు. తాను చేస్తున్న హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం సరిపోకపోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరడంతో పాటు ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్‌టైమ్‌గా చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని వానరాల కోసం ఖర్చు చేయడం ప్రారంభించాడు వెంకటేశన్. ‘‘మనం జల్సాల కోసం వినియోగించే మొత్తంలో కొంత భాగాన్ని కోతుల కోసం వినియోగిస్తే ఎంతో పుణ్యం వుంటుంది. ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకుంటే మంచిది’’ అంటున్న వెంకటేశన్ నాలుగు సంవత్సరాల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాడు. బ్లూక్రాస్ నుండి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెట్టారు. మరికొందరు ‘‘ఈ కోతుల గోల ఏమిటి?’’ అని గొడవకు దిగారు. దీంతో ఇంటి పక్కనే వున్న గుడిసెను ఖాళీ చేసి వేరే ప్రాంతంలో వాటి బాగోగులను చూడడం ప్రారంభించాడు. రాముడు, లక్ష్మీ, పెరుమాళ్, శివ, అజిత్, జిమ్మీ... మొదలైనవి వెంకటేశన్ పెంచుతున్న కోతుల పేర్లు. బంధువులు, గ్రామస్థులు ఇలా అందరూ వ ద్దని వారించినా నాలుగు సంవత్సరాల నుండి వానరాల సేవలో తరిస్తూ తన ఆత్మబంధువులు వానరాలే అని చెప్పుకుంటున్న వెంకటేశన్‌ను ఆదర్శంగా తీసుకుని రోజుకు ఒక పూటైనా ఒక జంతువుకు అన్నం పెట్టాలని నిర్ణయించుకుందాం. మూగప్రాణుల కోసం చేసే ఏ స్వల్ప కార్యమైనా అంతర్గతమైన శక్తిని మేల్కొలిపి హృదయాన్ని బలోపేతం చేస్తుందన్న విషయాన్ని గ్రహిద్దాం. - కోనేటి వెంకటేశ్వర్లు, తిరువళ్లూరు, తమిళనాడు -
ప్లస్‌టూ విద్యార్థి ఆత్మహత్య
సేలం, న్యూస్‌లైన్:ప్లస్‌టూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కేసులో పాఠశాల కరెస్పాండెంట్ సహా ఐదుగురిని నామక్కల్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నామక్కల్‌లో కురింజి మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఇందులో మదురైకు చెందిన వెంకటేశన్ (17), ప్లస్‌టూ చదువుతున్నాడు. శనివారం ఉదయం వెంకటేశన్ బస చేసి ఉన్న హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీ సులు పంచనామా నిమిత్తం వెంకటేశన్ మృత దేహాన్ని నామక్కల్ జీహెచ్ కు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు జీహెచ్‌కు వచ్చిన వెంకటేశన్ తల్లిదండ్రులు కళాశాల నిర్వాహకులే హత్య చేశారని ఆరోపించారు. ఆ సమయంలో వెంకటేశన్ అన్న శివ చిదంబరం మాట్లాడుతూ కొత్త సంవత్సరాది సందర్భంగా వెంకటేశన్ టీచర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కారణంగా పాఠశాల నిర్వాహకులే హత్య చేసినట్లు వెంకటేశన్ స్నేహితులు ఫోన్లో తమకు తెలిపినట్లు చెప్పాడు. అంతేకాకుండా వెంకటేశన్ భౌతికకాయానికి పోస్టుమార్టం నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేయరాదని, మదురై ఆస్పత్రిలో చేయిస్తామని తెలి పారు. అనంతరం వెంకటేశన్ తండ్రి శ్రీనివాసన్ నామక్కల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి పాఠశాల కరెస్పాండెంట్ తం గవేల్తో సహా ఐదుగురు తన కుమారుడిని హత్య చేసినట్టు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టా రు. అనంతరం నామక్కల్ పోలీసులు అర్ధరాత్రి 302 సెక్షన్ కింద పాఠశాల కరెస్పాండెంట్ తంగవేల్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి వెంకటేశన్ మృత దేహానికి నామక్కల్ జీహెచ్‌లోని పోస్టుమార్టం నిర్వహించారు.