సేలంలో 65 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం | Salem 65-foot statue of Jesus Christ | Sakshi
Sakshi News home page

సేలంలో 65 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం

Published Tue, Dec 24 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

Salem 65-foot statue of Jesus Christ

సేలం, న్యూస్‌లైన్ : దేశంలోనే అత్యంత ఎత్తై 65 అడుగుల ఎత్తుగల ఏసు క్రీస్తు విగ్రహాన్ని సేలంలో ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కె.వి.తంగబాలు ఆదివారం ఆవిష్కరించారు. సేలం జిల్లా పుత్రకౌండంపాళయం ప్రాంతంలోని 13వ సింగరాయన్ ఆలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగబాలు మాట్లాడు తూ ప్రేమ, ఆప్యాయత, దయాగుణాలకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయన బోధనలను అనుసరించి సన్మార్గంలో నడవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సేలం మరై మండలాధికారి సింగరాయన్, అనేక మంది క్రైస్తవ మత బోధకులు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఆకాశమంత ఎత్తులో దర్శనమిస్తున్న ఈ విగ్రహాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement