Saarika
-
పేరెంట్స్ విడాకులు.. మేమూ మనుషులమే: అక్షర హాసన్
తల్లిదండ్రులు కమల్ హాసన్- సారిక పేరు మోసిన యాక్టర్స్. అక్క శృతి హాసన్ కూడా సౌత్‌లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. అక్షర హాసన్ మాత్రం సినీ ఫీల్డులో కాస్త వెనుకబడే ఉంది. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఈ బ్యూటీ షమితాబ్ మూవీతో నటిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. వివేగం, కరం కొందాన్, అచ్చం మేడమ్ నానమ్ పయిరప్పు వంటి చిత్రాలతో కోలీవుడ్‌లోనూ పేరు సంపాదించుకుంది. కానీ స్టార్ స్టేటస్‌కు మాత్రం దూరంగానే ఉండిపోయింది.ఒంటరిగా వదిలేయలేదుతాజాగా ఈ బ్యూటీ తన పేరెంట్స్ విడాకులు తమను ఎంత బాధపెట్టాయో వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సెలబ్రిటీ పిల్లలమైనంత మాత్రాన మాకు ఎమోషన్స్ ఉండవా? మేమూ మనుషులమే! తల్లిదండ్రులు విడిపోతే అందరూ ఎలా బాధపడతారో మేమూ అలాగే బాధపడ్డాం. కానీ వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదు. ఎంతో ప్రేమ చూపించారు. ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నా పేరెంట్స్‌గా మాకు అండగా నిలబడ్డారు.అండగా నిలబడ్డ శ్రుతి హాసన్కొన్నిసార్లు నాకేదైనా అవసరమైతే మా అక్క దగ్గరకు వెళ్లేదాన్ని. స్కూల్లో కొందరు ఏడిపిస్తున్నారని, కొట్టాలని ఉందని చెప్తే హింస వద్దని సూచించేది. తను రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెట్టేది. మేము ఒకరి కోసం ఒకరం నిలబడతాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మా కుటుంబంలో అందరం ఒకరికొకరు సపోర్ట్‌గానే ఉన్నారు. ఆ ప్రేమానురాగాలను అలాగే కొనసాగించాం' అని పేర్కొంది. కాగా కమల్- సారిక 2002లో విడిపోగా 2004లో విడాకులు తీసుకున్నారు.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్
సినిమాల నుంచి కాస్తా విరామం తీసుకున్న శ్రుతిహాసన్ సంగీతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. గతేడాది స్వయంగా తన బృందంతో లండన్‌లో తాను కంపోజ్ చేసిన పాటలను ప్రదర్శించి అక్కడి అభిమానులను అలరించింది. అయితే మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిన శుత్రికి ఇటీవల వీరి బంధానికి బ్రేక్ పడటంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న‘లాభం’ సినిమాలో నటిస్తుండగా.. తెలుగులో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. జీవితానికి విశ్రాంతి, ప్రశాంతత ఎంతో అవసరమని.. సినిమాలను, మ్యూజిక్‌ను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ఆమె తల్లిదండ్రులు(కమల్‌హాసన్, సారికా) విడిపోవడం గురించి, అది ఆమెకు నేర్పిన విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. ఎంత మంచి కుటుంబం నుంచి వచ్చిన వారికైనా బాధలు, సమస్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు కలిసున్నప్పటికీ ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయని, అవి కూడా లైఫ్‌లో భాగమని పేర్కొన్నారు. ఇక తన తల్లిదండ్రులు గురించి మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు విడిపోతే అది తప్పకుండా బాధాకరమైన విషయమే కానీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు విడిపోయి జీవించడమే మేలు. నేను చూసిన వారిలో చాలామంది భార్యభర్తలు విడిపోయారు. ఇది ఇతరులకు మాత్రమే విషయం.. ఆ కుటుంబానికి కాదు. వారు తీసుకున్న నిర్ణయంతో వారితో పాటు నేను కూడా సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే వారిద్ధరూ కూడా వారి వారి వ్యక్తిగత జీవితాలలో ఆనందంగానే ఉన్నారు. వారు నా తల్లిదండ్రులు కాకముందే ఇద్దరు వ్యక్తులు.. వాళ్లకూ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయమే నేను ఎప్పుడూ చెబుతుంటాను’ అని ఆమె తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చారు శృతిహాసన్. -
అర్ధ నగ్నంగా సారిక
నిరాయుధం చిత్రం కోసం ఆ చిత్ర హీరోయిన్ సారిక అర్ధనగ్నంగా నటించారు. ఎస్పీఎం క్రియేషన్స్ పతాకంపై పొల్లాచ్చి ఎస్.మోహన్ సుందర్ నిర్మిస్తున్న చిత్రం నిరాయుధం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి సారిక హీరోయిన్గా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో వెంకట్ అనే నూతన నటుడు పరిచయం అవుతున్నారు. ఎంబి రాజదురై కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ చిత్ర హీరో సంతోష్ అమెరికా నుంచి వచ్చిన బృందా పార్టీ అన్నారు. హీరోయిన్ సారిక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారన్నారు. ట్రావెల్ డ్రైవర్‌గా వెంకట్ హీరోయిన్ను రోజు అర్ధరాత్రి కాల్టాక్సీలో ఇంటికి తీసుకెళతాడన్నారు. అలాంటిది అతను ఒకసారి అనూహ్యంగా సారిక ముఖంపై మత్తుమందు చల్లి కిడ్నాప్ చేస్తాడని చెప్పారు. ఆ తరువాత స్పృహలో కొచ్చిన సారిక తాను అర్ధనగ్నం దుస్తుల్లో ఒకగదిలో ఉండడం చూసి షాక్ అవుతుందన్నారు. ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడుతుండగా మరో గదిలో హీరో సంతోష్ అర్ధనగ్న దుస్తుల్లో కనిపిస్తాడన్నారు. వీరిద్దరూ కలిసి అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నారా? అసలు వారిని కిడ్నాప్ చేయడానికి కారణం ఏమిటి? ఇత్యాది పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే నిరాయుధం చిత్రం అని చెప్పారు. చిత్రానికి సంగీతాన్ని కణి, చాయాగ్రహణం శరవణకుమార్ అందిస్తున్నారు.