అర్ధ నగ్నంగా సారిక
నిరాయుధం చిత్రం కోసం ఆ చిత్ర హీరోయిన్ సారిక అర్ధనగ్నంగా నటించారు. ఎస్‌పీఎం క్రియేషన్స్ పతాకంపై పొల్లాచ్చి ఎస్.మోహన్ సుందర్ నిర్మిస్తున్న చిత్రం నిరాయుధం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో వెంకట్ అనే నూతన నటుడు పరిచయం అవుతున్నారు. ఎంబి రాజదురై కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ చిత్ర హీరో సంతోష్ అమెరికా నుంచి వచ్చిన బృందా పార్టీ అన్నారు.
హీరోయిన్ సారిక ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటారన్నారు. ట్రావెల్ డ్రైవర్‌గా వెంకట్ హీరోయిన్‌ను రోజు అర్ధరాత్రి కాల్‌టాక్సీలో ఇంటికి తీసుకెళతాడన్నారు. అలాంటిది అతను ఒకసారి అనూహ్యంగా సారిక ముఖంపై మత్తుమందు చల్లి కిడ్నాప్ చేస్తాడని చెప్పారు. ఆ తరువాత స్పృహలో కొచ్చిన సారిక తాను అర్ధనగ్నం దుస్తుల్లో ఒకగదిలో ఉండడం చూసి షాక్ అవుతుందన్నారు. ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడుతుండగా మరో గదిలో హీరో సంతోష్ అర్ధనగ్న దుస్తుల్లో కనిపిస్తాడన్నారు.
వీరిద్దరూ కలిసి అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నారా? అసలు వారిని కిడ్నాప్ చేయడానికి కారణం ఏమిటి? ఇత్యాది పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే నిరాయుధం చిత్రం అని చెప్పారు. చిత్రానికి సంగీతాన్ని కణి, చాయాగ్రహణం శరవణకుమార్ అందిస్తున్నారు.