ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్‌ | Punya Elizabeth Gets Married, Shares Photos On Instagram | Sakshi
Sakshi News home page

బర్త్‌డే రోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన బ్యూటీ.. పెళ్లయిపోయిందోచ్‌ అంటూ..

Published Thu, Jul 18 2024 12:27 PM | Last Updated on Thu, Jul 18 2024 12:59 PM

Punya Elizabeth Got Married Shares Photos

మలయాళ హీరోయిన్‌ పుణ్య ఎలిజబెత్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. టోబి కోయిపల్లి అనే వ్యక్తిని పెళ్లాడినట్లు తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో వదిలింది. 'నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకున్న నా ప్రియుడు గతవారమే పెళ్లి ముహూర్తం పెట్టేశాడు. అలా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక ఈరోజు 30వ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. 

ఇది చూసిన అభిమానులు పుణ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్లి కోసం ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అంతా కలిసి ఈ మ్యారేజ్‌ వేడుకలను రెట్టింపు సంతోషంతో ఎంజాయ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ బ్యూటీ 2018లో తోబమ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. గౌతమంటే రాధం అనే మాలీవుడ్‌ సినిమాలోనూ కథానాయికగా మెరిసింది. మార, గెట్‌ సెట్‌ బేబీ, లియో వంటి తమిళ చిత్రాల్లోనూ నటించింది.

 

 

చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement