కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో | Dhanush celebrates quiet birth day with family, friends | Sakshi
Sakshi News home page

కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో

Published Mon, Jul 28 2014 12:13 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో - Sakshi

కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో

చెన్నై : కోలీవుడ్ యువ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ 31వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అతడు తన పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం రాత్రి జరుపుకున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'షమితాబ్' ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో అతడి సరసన  కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బర్త్డే సందర్భంగా ధనుష్  తన తల్లిదండ్రులు, భార్య ఐశ్వర్యతో గడిపేందుకు ముంబయి నుంచి చెన్నై వచ్చాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య ...ధనుష్ కు బర్త్డై పార్టీ ఏర్పాటు చేసి సర్ప్రయిజ్ చేసినట్లు సమాచారం. పుట్టినరోజు పార్టీలో కుటుంబ సభ్యులతో పాటు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్, అతని సతీమణి గీతాంజలి, హీరో శింబు, శ్రియ, అమలాపాల్, సురభి తదితరులు అ పార్టీలో హల్ చల్ చేశారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 26కేజీల కేక్ను ధనుష్  కట్ చేసాడు. ఇక ఈ సంవత్సరం ధనుష్‌కు ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఓవైపు బాలీవుడ్లో దూసుకుపోవటంతో పాటు, ధనుష్ నిర్మించి, నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' చిత్రం విజయబాటలో పయనిస్తోంది. గత వారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే రూ. 20 కోట్లు వసూలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement