షమితాబ్ లుక్ విడుదల చేసిన అమితాబ్ | Big B shares 'Shamitabh' look, says difficult to preserve | Sakshi
Sakshi News home page

షమితాబ్ లుక్ విడుదల చేసిన అమితాబ్

Published Mon, Jul 21 2014 12:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షమితాబ్ లుక్ విడుదల చేసిన అమితాబ్ - Sakshi

షమితాబ్ లుక్ విడుదల చేసిన అమితాబ్

తన కొత్త చిత్రం షమితాబ్ లుక్ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ సినిమాలో అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు, గెడ్డంతో అమితాబ్ (71) చాలా విభిన్నంగా కనిపిస్తారు. ఫొటోగ్రాఫర్ల కంటపడకుండా ఈ సినిమా గెటప్ను ఎక్కువ కాలం దాచి ఉంచడం చాలా కష్టమని, అందుకే తాను విడుదల చేసేస్తున్నానని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.

సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తమ చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటినుంచి ఈ గెటప్ను కాపాడటం చాలా కష్టమని బచ్చన్ తన బ్లాగులో కూడా రాశారు. షమితాబ్ సినిమాకు ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. గోవా, తమిళనాడులలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement