Illayaraja
-
డబుల్ మీనింగ్ పాటలు పాడటానికి కారణం...
-
నా జీవితంలో అన్నిటినీ చూస్తాను నా పిల్లల సంతోషం తప్ప..!
-
అమ్మవారిని దర్శించుకున్న ఇళయరాజా..
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దర్శించుకున్నారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాకు అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేసారు. -
సెక్యూరిటీ గార్డుపై ఇళయ రాజా ఫైర్
-
ఇళయరాజాకు ఏమైంది? వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. మైధోహక్కులపై గత కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఇళయ రాజా సెక్యూరిటీ గార్డ్‌పై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే అక్కడున్న ఆడియన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇళయరాజా 76వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల(జూన్ 2) చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గానగంధర్వులు సుబ్రహ్మాణ్యం, జేసుదాసు, ఇతర ప్రముఖ గాయనీగాయకులు కూడా హాజరయ్యారు. ఈవీపీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన మ్యూజికల్ కన్సర్ట్‌లో ఇద్దరు లెజెండ్స్ (బాలు, ఇళయరాజా) ఒకే వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించడం మరపురానిదిగా పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ స్టేజ్‌పై ఉన్న గాయకులకు మంచి నీళ్ళ సీసాలు ఇవ్వడానికి వెళ్లాడు. ఇదే ఇళయ రాజాకు కోపం తెప్పించింది. అనుమతి లేకుండా నువ్వు స్టేజ్‌పైకి వచ్చి ఎందుకు కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఫలించకపోవడంతో చివరకు ఇళయరాజాకి క్షమాపణలు చెప్పి కాళ్ళు మొక్కి వెళ్లిపోయారు. అయినా తన అసహనాన్ని కొనసాగించిన ఇళయరాజా ఆడియన్స్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారితోపాటు, వీడియోను వీక్షించిన నెటిజన్లు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నారు. செக்யூரிட்டு இளையராஜா கால்ல விழுந்தாரே அந்த வீடியோ இருக்கா ப்ரோ — sakthi (@imsakthi1) June 2, 2019 -
హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్!
ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన మొట్ట మెదటిసారిగా ఇస్తున్న లైవ్ కన్సర్ట్ ఇది. ఈ ఈవెంట్ విశేషాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇళయరాజా పాల్గొన్నారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో కలిసి ఈవెంట్ టికెట్స్‌ను లాంచ్ చేశారాయన. టెంపుల్ బెల్ ఈవెంట్స్ అండ్ మీడియా మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ– ‘‘నేను ఇంతవరకు హైదరాబాద్‌లో పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ౖ టెమ్ పర్ఫార్మ్ చేయడానికి ఆసక్తికరంగా ఎదరుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఇళయరాజాగారి కంపోజిషన్స్కి బిగ్ ఫ్యాన్స్ మేము. హైదరాబాద్‌లో ఆయన పర్ఫార్మెన్స్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఇక్కడ ఇళయరాజాగారి ఫస్ట్ మ్యూజిక్ కన్సర్ట్ను కండక్ట్ చేసే అవకాశం మాకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. సంగీతప్రియులకు ఈ ఈవెంట్ ఒక గ్రేట్ ట్రీట్’’అని టెంపుల్బెల్ ఈవెంట్స్ ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్ జి. సందీప్ తెలిపారు. ఈ ఈవెంట్లో 80 మంది మ్యూజిషియన్స్‌తో ఆర్కెస్ట్రా ఉంటుంది. -
దేవుణ్ణి చూడాలనుకుంటే షోకి రండి! – సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
‘‘ఇళయరాజా ఉన్న కాలంలో మనం ఉండడం అదృష్టం. అదీ మనందరి ముందు ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మరింత అదృష్టం. (‘మ్యూజిక్’) దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజా (ఇళయరాజా) గారి షోకి రండి. ఆయన సంగీత దర్శకత్వంలో ‘చిరుగాలి వీచెనే’ పాట పాడే చాన్స్, ఆయన్ని కలసే చాన్స్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకులు–నటుడు–దర్శక–రచయిత ఆర్పీ పట్నాయక్. ఈ ఆదివారం (నవంబర్ 5న) హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘‘ఇళయరాజా లైవ్ షోకి ఫ్రీ పాసులు కావాలా? అయితే... ‘రాజా కాలింగ్ ఆజా’ పోటీలో పాల్గొనండి’’ అని ‘సాక్షి’ పాఠకులకు ‘షో క్విజ్’ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. వాళ్లలో సరైన సమాధానాలు రాసి పంపిన 600 మందిని ఎంపిక చేశారు. 600 మందిలోంచి 200 మంది లక్కీ మెంబర్స్‌ను ఆర్పీ పట్నాయక్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంపిక చేశారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా, ‘వినవయ్యా రామయ్యా’, ఈ శుక్రవారం విడుదలవుతోన్న ‘ఏంజెల్’లో హీరోగా నటించిన నాగ అన్వేష్ మాట్లాడుతూ– ‘‘రాజాగారి పాటల్లో ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటంటే నాకెంతో ఇష్టం. టీవీలో ఆ పాట ఎప్పుడొచ్చినా... పనులన్నీ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటా. లక్కీ డ్రాలో పాసులు పొందిన 200 మందికి కంగ్రాట్స్. నా ఫ్రెండ్స్, స్టాఫ్ కూడా పాసులు అడుగుతున్నారు. ఒక్క ఎక్స్రా›్ట పాస్ ఉంటే నాకు ఇవ్వండి’’ అన్నారు. ‘మీ దగ్గర ఒక్క పాస్ ఉంటే... ఇంట్లో ఇల్లాలిని తీసుకువెళతారా? వంటింట్లో ప్రియురాలిని తీసుకువెళతారా?’ అని నాగ అన్వేష్ని అడగ్గా... ‘‘నేను ఇంట్లో కూర్చుని ఇద్దరినీ రాజాగారి లైవ్ కన్సర్ట్కి పంపిస్తా’’ అని నవ్వేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం హ్యపీగా ఉందని హెబ్బా పటేల్ చెప్పారు. విజేతలు (200 మంది)... తమ వివరాలను ‘సాక్షి’ వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే, వాళ్ల మొబైల్ నంబర్లకు ఎసెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 2, 3, 4వ తేదీల్లో హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విజేతలు తమ మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్లు 5వ తేదీ మధ్యహ్నం 2 గంటలలోపు వచ్చి పాసులు పొందవచ్చు. ఫార్వార్డ్ మెసేజ్‌లకు పాసులు ఇవ్వబడవు. ఏ నంబర్‌కి మెసేజ్ వస్తే.. ఆ నంబర్‌కే పాస్ ఇవ్వబడును. -
ఆ లెజెండ్ స్మృతిలో..
చెన్న్: సుమారు నాలుగు దశాబ్దాలపాటు సంగీత ప్రపంచాన్నేలిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్‌కు నివాళిగా మరో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన లెజెండ్రీ సంగీత దర్శకుడి స్మృతిలో నెల 27న సంగీత విభావరి నిర్వహించేందుకు పూనుకున్నారు. "ఎన్నుల్లే ఎల్లా ఎంఎస్వీ" పేరుతో చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఇళయ రాజా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. విశ్వనాథన్ స్వరపర్చిన 30 టాప్ పాటలను ఈ విభావరిలో ఆలపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంఎస్వీ బృందంలోని సభ్యులందర్నీఒక చోటకు చేర్చాలని మాస్ట్రో ఆలోచిస్తున్నారు. అలాగే ఎంఎస్వీ సంగీత దర్శకత్వంలో సినీగీతాలను ఆలపించిన గాయనీ గాయకులందర్నీ కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. కాగా 750 సినిమాలకు పైగా స్వరాలను సమకూర్చిన విశ్వనాథన్ ఇళయారాజాను బాగా ప్రభావితం చేశారని సినీ పండితులు చెబుతారు. -
'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే'
ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరొకరు విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. కానీ ఇద్దరికి ఇద్దరూ చిన్న పిల్లల్లాంటి వాళ్లేనని ఓ దర్శకుడు అన్నారు. ఆయనెవరో కాదు.. షమితాబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆర్.బాల్కి. గతంలో అమితాబ్ నటించిన 'పా' సినిమాకు కూడా బాల్కియే దర్శకుడు. తాజాగా షమితాబ్ సినిమాలో అమితాబ్ ఓ పాట పాడారు. భారతీయ సినిమా ప్రపంచంలో రెండు పెద్ద వ్యవస్థల లాంటి ఇద్దరు ప్రముఖులతో తాను సినిమా తీయడం చాలా అదృష్టమని బాల్కి అన్నారు. తాను ఇంతవరకు దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో వీళ్లిద్దరితో పనిచేశానన్నారు. ఇద్దరికీ సరిగ్గా 73 ఏళ్ల వయసే ఉందని.. కానీ రికార్డింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ చిన్న పిల్లల్లా చాలా ఉద్వేగానికి గురయ్యారని బాల్కి చెప్పారు. పిల్లలను ఏదైనా బొమ్మల దుకాణంలో వదిలేస్తే ఎంత ఆనందంగా ఉంటారో.. వీళ్లిద్దరూ అప్పుడు అంత ఆనందంగా ఉన్నారన్నారు. ఈ వయసులో కూడా వాళ్ల ఉత్సుకత అంతలా ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని బాల్కి చెప్పారు. అమితాబ్ గతంలో రాజేష్ రోషన్, శివ్-హరి, ఆదేశ్ శ్రీవాత్సవ, ఆర్డీ బర్మన్, కళ్యాణ్‌జీ - ఆనంద్జీ ఇలా.. పలువురు సంగీత దర్శకుల వద్ద పాడారు. -
తండ్రీ కొడుకుల సమక్షంలో..
తిరునెల్విలి: భారతీయ సినీతెరపై తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా, ఆయన కొడుకు యువన్ శంకర్ రాజాలు కలిసి ఒకే వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తొలిసారి వారివురి సమక్షంలో జరిగే సంగీత కార్యక్రమానికి సంక్రాంతి పండుగ వేదిక కానుంది. జనవరి 17వ తేదీన తిరున్వెల్లిలో జరిగే సంగీత కార్యక్రమంలో తన తండ్రితో కలిసి ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు యువన్ తెలిపాడు. 'యువన్ మ్యూజికల్ ఎక్స్ ప్రెస్'పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపాడు. ముందుగా చెన్నై లో ఇవ్వనున్న సంగీత కార్యక్రమం అనంతరం మలేషియా, సింగపూర్ లలో ఉంటుందని యువన్ స్పష్టం చేశాడు. పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ లతో తమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దక్షిణ తమిళనాడులోని తిరున్వెలిలో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం మాత్రం తన తొలి సినిమా 'అరవిందన్' ఇక్కడే షూటింగ్ చేసుకోవడమేన్నాడు. -
'రౌడీ' సంగీతం ఇళయరాజాకు అంకితం: వర్మ
'రౌడీ' చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ స్కోరును సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు అంకితం ఇస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. గతకొద్ది సంవత్సరాలుగా ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నానని.. ఆయనకు అభిమానినని వర్మ తెలిపారు. శివ చిత్రంలోని సైకిల్ ఛేజ్ థీమ్ ను తీసుకుని రౌడీ ప్రధాన థీమ్ ను రూపొందించాలని దర్శకుడు సాయి కార్తీక్ ను కోరానని...అయితే ఆ ఐడియా బ్రహ్మండంగా వర్కవుట్ అయిందని వర్మ తెలిపారు. రౌడీ బ్యాక్ గ్రౌండ్ థీమ్ ను 'సైకిల్ రౌడీ'గా పేర్కొన్నారు. ఇళయరాజాకు అమితంగా అభిమానిస్తానని, ఆయనకు పెద్ద అభిమానినని, ఆయన శివ చిత్రానికి రూపొందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని వర్మ తెలిపారు. 1989లో శివ చిత్రంలో సైకిల్ ఛేజ్ కోసం ఇళయరాజా రూపొందించిన నేపథ్య సంగీతం ఇప్పటికి మర్చిపోలేనని ఆయన అన్నారు. ఇళయరాజాకు సెల్యూట్ అని వర్మ వ్యాఖ్యానించారు. వర్మ తొలి చిత్రం 'శివ'కు ఇళయరాజా సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
రొమాంటిక్ స్వరాలు..!
ఇళయరాజాకు ట్రెండ్‌తో పనిలేదు. నవతరంతో పోటీ పడుతూ... ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ ఇస్తూనే ఉన్నారాయన. గత ఏడాది ‘గుండెల్లో గోదారి’తో సంగీతాభిమానుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన మేస్ట్రో... మళ్లీ ఓ తెలుగు సినిమాకు తన స్వరాలతో సొగబులద్దుతున్నారు. ఆ సినిమానే.. ‘వస్తా నీ వెనుక’. రమేశ్‌వర్మ దర్శకత్వంలో హవీష్, అమలాపాల్, ఇష జంటగా దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం సమపాళ్లలో రంగరించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. దానికి తగ్గట్టే అద్భుతమైన ఆరు పాటలను ఇళయరాజా అందించారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఏప్రిల్ 4 నుంచి 55 రోజుల పాటు యూరప్‌లో భారీ షెడ్యూల్ చేయనున్నాం. టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా అక్కడే చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. హవీష్, అమలాపాల్, ఇష పాత్రలు యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంటాయని, శ్రోతల్ని అలరించేలా ఇళయరాజా స్వరాలుంటాయని రమేష్‌వర్మ చెప్పారు. ఈ చిత్రానికి రచన: విస్సు, కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ. -
త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సంఘం ఏర్పాటుకానుంది. ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రిక తీసుకురావడంతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా ఈ సంఘం పాల్గొంటుంది. ఇది ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండబోదని, విభిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు. ఆ కళాకారుడి ద్వారా అభిమానులకు చేరువ కావడమే అభిమాన సంఘాల ఉద్దేశం అవుతుందని, దాన్ని తాము సాధిస్తామని అన్నాడు. 'ఇసైజ్ఞాని' అనే పేరుతో వారపత్రికను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఇందులో ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలు అన్నీ ఉంటాయి. ఇళయరాజా వారసుడిగా సంగీత దర్శకత్వంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇప్పటికి దక్షిణాదిలోని పలు భాషల్లో 50 సినిమాలకు సంగీతం అందించాడు. -
కుదుటపడిన ఇళయరాజా ఆరోగ్యం
సంగీత ప్రపంచ రారాజు ఇళయరాజా ఆరోగ్యం కుదుటపడిందని ఆయన మేనల్లుడు, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇళయరాజాకు స్వల్పంగా గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల ఇళయరాజాకు గుండెలో కొద్దిగా నొప్పి అనిపించడంతో వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అంతా బాగానే ఉందని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ''మా మామయ్య, ఇసైజ్ఞాని ఇళయారాజా బాగున్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేసినవారికి, ప్రేమను అందించిన వారికి అందరికీ కృతజ్ఞతలు'' అని వెంకట్ ప్రభు తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఇళయరాజాను త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. పలు భాషల్లో ఇళయరాజా ఇప్పటికి 900కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా తలైమురైగల్ చిత్రంలో ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల మదిని దోచుకుంది. దళపతి, క్షత్రియపుత్రుడు, దేవరాగం, నాయకుడు.. ఇలా అనేక చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. త్వరలో ఆయన మలేసియాలో లైవ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. My uncle!! our isaignani!! Is absolutely fine!! Thanks for the love and prayers!! — venkat prabhu (@dirvenkatprabhu) December 23, 2013 -
ఇళయరాజాకు స్వల్ప గుండెపోటు