
రొమాంటిక్ స్వరాలు..!
ఇళయరాజాకు ట్రెండ్‌తో పనిలేదు. నవతరంతో పోటీ పడుతూ... ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ ఇస్తూనే ఉన్నారాయన. గత ఏడాది ‘గుండెల్లో గోదారి’తో సంగీతాభిమానుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన మేస్ట్రో... మళ్లీ ఓ తెలుగు సినిమాకు తన స్వరాలతో సొగబులద్దుతున్నారు. ఆ సినిమానే.. ‘వస్తా నీ వెనుక’. రమేశ్‌వర్మ దర్శకత్వంలో హవీష్, అమలాపాల్, ఇష జంటగా దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది.
దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం సమపాళ్లలో రంగరించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. దానికి తగ్గట్టే అద్భుతమైన ఆరు పాటలను ఇళయరాజా అందించారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఏప్రిల్ 4 నుంచి 55 రోజుల పాటు యూరప్‌లో భారీ షెడ్యూల్ చేయనున్నాం. టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా అక్కడే చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. హవీష్, అమలాపాల్, ఇష పాత్రలు యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంటాయని, శ్రోతల్ని అలరించేలా ఇళయరాజా స్వరాలుంటాయని రమేష్‌వర్మ చెప్పారు. ఈ చిత్రానికి రచన: విస్సు, కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ.