
తండ్రీ కొడుకుల సమక్షంలో..
తిరునెల్విలి: భారతీయ సినీతెరపై తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా, ఆయన కొడుకు యువన్ శంకర్ రాజాలు కలిసి ఒకే వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తొలిసారి వారివురి సమక్షంలో జరిగే సంగీత కార్యక్రమానికి సంక్రాంతి పండుగ వేదిక కానుంది. జనవరి 17వ తేదీన తిరున్వెల్లిలో జరిగే సంగీత కార్యక్రమంలో తన తండ్రితో కలిసి ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు యువన్ తెలిపాడు. 'యువన్ మ్యూజికల్ ఎక్స్ ప్రెస్'పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపాడు.
ముందుగా చెన్నై లో ఇవ్వనున్న సంగీత కార్యక్రమం అనంతరం మలేషియా, సింగపూర్ లలో ఉంటుందని యువన్ స్పష్టం చేశాడు. పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ లతో తమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దక్షిణ తమిళనాడులోని తిరున్వెలిలో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం మాత్రం తన తొలి సినిమా 'అరవిందన్' ఇక్కడే షూటింగ్ చేసుకోవడమేన్నాడు.