ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. మైధోహక్కులపై గత కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఇళయ రాజా సెక్యూరిటీ గార్డ్‌పై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే అక్కడున్న ఆడియన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇళయరాజా 76వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల(జూన్ 2) చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గానగంధర్వులు సుబ్రహ్మాణ్యం, జేసుదాసు, ఇతర ప్రముఖ గాయనీగాయకులు కూడా హాజరయ్యారు. ఈవీపీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన మ్యూజికల్ కన్సర్ట్‌లో ఇద్దరు లెజెండ్స్ (బాలు, ఇళయరాజా) ఒకే వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించడం మరపురానిదిగా పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ స్టేజ్‌పై ఉన్న గాయకులకు మంచి నీళ్ళ సీసాలు ఇవ్వడానికి వెళ్లాడు. ఇదే ఇళయ రాజాకు కోపం తెప్పించింది. అనుమతి లేకుండా నువ్వు స్టేజ్‌పైకి వచ్చి ఎందుకు కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఫలించకపోవడంతో చివరకు ఇళయరాజాకి క్షమాపణలు చెప్పి కాళ్ళు మొక్కి వెళ్లిపోయారు. అయినా తన అసహనాన్ని కొనసాగించిన ఇళయరాజా ఆడియన్స్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారితోపాటు, వీడియోను వీక్షించిన నెటిజన్లు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నారు.
செக்யூரிட்டு இளையராஜா கால்ல விழுந்தாரே அந்த வீடியோ இருக்கா ப்ரோ
— sakthi (@imsakthi1) June 2, 2019
Comments
Please login to add a commentAdd a comment