loses control
-
మరోసారి సహనం కోల్పోయిన నితీష్.. మహిళా నేతపై అరిచిన సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.దీనిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్ కుమార్ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్ కుమార్.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
తండ్రికి గుండె నొప్పి వచ్చిందని..కారుని వేగంగా పోనివ్వడంతో...
ఒక వ్యక్తి తండ్రికి గుండె నొప్పి రావడంతో రక్షించుకోవాలన్న తాపత్రయంలో కారుని వేగంగా పోనిచ్చి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నోయిడాలోని బహ్లోల్పూర్ నివాసి ప్రదీప్ సింగ్ తండ్రి భూప్ సింగ్ అతని భార్య తొమిదేళ్ల కుమార్తె బులంద్‌షహర్‌లో ఉన్న పచౌటా ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా హఠాత్తుగా తండ్రికి గుండె నొప్పి వచ్చింది. దీంతో తండ్రిని రక్షించుకోవాలన్న ఆత్రుతలో కారుని వేగంగా పోనిచ్చాడు. కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి హైవే సమీపంలోని గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ భార్య, తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. అతడి తండ్రిని ఘజియాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, భార్యని కోట్ దాద్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ప్రమాదంలో అతని భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా, అతని తండ్రి మాత్రం చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ప్రదీప్, అతడి భార్య, కుమార్తె సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ని తరలిస్తున్న వ్యాన్‌పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు) -
సెక్యూరిటీ గార్డుపై ఇళయ రాజా ఫైర్
-
ఇళయరాజాకు ఏమైంది? వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. మైధోహక్కులపై గత కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఇళయ రాజా సెక్యూరిటీ గార్డ్‌పై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే అక్కడున్న ఆడియన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇళయరాజా 76వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల(జూన్ 2) చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గానగంధర్వులు సుబ్రహ్మాణ్యం, జేసుదాసు, ఇతర ప్రముఖ గాయనీగాయకులు కూడా హాజరయ్యారు. ఈవీపీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన మ్యూజికల్ కన్సర్ట్‌లో ఇద్దరు లెజెండ్స్ (బాలు, ఇళయరాజా) ఒకే వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించడం మరపురానిదిగా పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ స్టేజ్‌పై ఉన్న గాయకులకు మంచి నీళ్ళ సీసాలు ఇవ్వడానికి వెళ్లాడు. ఇదే ఇళయ రాజాకు కోపం తెప్పించింది. అనుమతి లేకుండా నువ్వు స్టేజ్‌పైకి వచ్చి ఎందుకు కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఫలించకపోవడంతో చివరకు ఇళయరాజాకి క్షమాపణలు చెప్పి కాళ్ళు మొక్కి వెళ్లిపోయారు. అయినా తన అసహనాన్ని కొనసాగించిన ఇళయరాజా ఆడియన్స్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారితోపాటు, వీడియోను వీక్షించిన నెటిజన్లు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నారు. செக்யூரிட்டு இளையராஜா கால்ல விழுந்தாரே அந்த வீடியோ இருக்கா ப்ரோ — sakthi (@imsakthi1) June 2, 2019 -
చెన్నైలో వాలిన సమంత!
ప్రస్తుత క్రేజీ హీరోయిన్లలో సమంత ఒకరు. అలాంటిది ఎందుకో ఈ బ్యూటీకి సడన్‌గా అవకాశాలు తగ్గాయి. కావాలనే ఈ చెన్నై చిన్నది అవకాశాలు తగ్గించుకుంటోందనే వాదన లేకపోలేదు. నటుడు సిద్ధార్థ్‌తో ఈ అమ్మడిని కలుపుతూ బోలెడు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఆ ప్రేమ బ్రేక్ అప్ అయిందని ఇలా రకరకాల ప్రచారాలతో సమంత మీడియాకు మంచి పనే చెబుతోంది. ఏది నిజం అన్న విషయాన్ని పక్కన పెడితే తమిళంలో కత్తి లాంటి భారీ విజయాన్ని సమంత అందుకుంది. ఇప్పుడు విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎన్‌డ్రదుక్కుళ్ చిత్రం మినహా కొత్త అవకాశం ఏదీ లేదు. దీంతో ఖాళీగా కూర్చొని చేతికందిందల్లా తినేసి ఎక్కడ బరువు పెరిగి పోతుందోనన్న భయంతో ఈ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ ఆహార విషయాల్లో నియమాలు పాటించాల్సిందిగా సమంతకు సూచించారట. అయితే పత్తు ఎండ్రదుకుళ్ చిత్ర షూటింగ్లో కాస్త గ్యాప్ రావడంతో అమ్మడు చెన్నైకి చెక్కేసిందట. ఇక్కడ ఇడ్లీ, సాంబారు, పొంగళ్, దోశ, వడ అంటూ ఆహారపు కట్టుబాట్లను పక్కన పెట్టి సుష్టిగా లాగించేస్తుందట. పైగా ఈ అల్పాహారానికి తాను బానిసనని, అందుకే చెన్నై వస్తే ఆహార నియమాలను పక్కనపెట్టి ఫుల్‌గా లాగించేస్తానని అంటోంది. త్వరలో నటనకు స్వస్తి చెప్పి సిద్ధార్థ్‌తో పెళ్లికి సిద్ధం అవుతున్నందు వల్లే ఈ అమ్మడు ఇలా ఆహార నియమాలకు నీళ్లొదిలిందనే వారు లేకపోలేదు. అయితే త్వరలోనే సమంత సిద్ధార్థ్‌తో కలిసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోందన్న వార్త వినిపిస్తోంది.