
ఒక వ్యక్తి తండ్రికి గుండె నొప్పి రావడంతో రక్షించుకోవాలన్న తాపత్రయంలో కారుని వేగంగా పోనిచ్చి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నోయిడాలోని బహ్లోల్‌పూర్ నివాసి ప్రదీప్ సింగ్ తండ్రి భూప్ సింగ్ అతని భార్య తొమిదేళ్ల కుమార్తె బులంద్‌షహర్‌లో ఉన్న పచౌటా ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా హఠాత్తుగా తండ్రికి గుండె నొప్పి వచ్చింది.
దీంతో తండ్రిని రక్షించుకోవాలన్న ఆత్రుతలో కారుని వేగంగా పోనిచ్చాడు. కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి హైవే సమీపంలోని గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ భార్య, తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. అతడి తండ్రిని ఘజియాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, భార్యని కోట్ దాద్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ప్రమాదంలో అతని భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా, అతని తండ్రి మాత్రం చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ప్రదీప్, అతడి భార్య, కుమార్తె సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ని తరలిస్తున్న వ్యాన్‌పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు)
Comments
Please login to add a commentAdd a comment