చెన్నైలో వాలిన సమంత! | Samantha loses control in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో వాలిన సమంత!

Published Sun, Dec 21 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

చెన్నైలో వాలిన సమంత!

చెన్నైలో వాలిన సమంత!

 ప్రస్తుత క్రేజీ హీరోయిన్లలో సమంత ఒకరు. అలాంటిది ఎందుకో ఈ బ్యూటీకి సడన్‌గా అవకాశాలు తగ్గాయి. కావాలనే ఈ చెన్నై చిన్నది అవకాశాలు తగ్గించుకుంటోందనే వాదన లేకపోలేదు. నటుడు సిద్ధార్థ్‌తో ఈ అమ్మడిని కలుపుతూ బోలెడు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఆ ప్రేమ బ్రేక్ అప్ అయిందని ఇలా రకరకాల ప్రచారాలతో సమంత మీడియాకు మంచి పనే చెబుతోంది. ఏది నిజం అన్న విషయాన్ని పక్కన పెడితే తమిళంలో కత్తి లాంటి భారీ విజయాన్ని సమంత అందుకుంది. ఇప్పుడు విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎన్‌డ్రదుక్కుళ్ చిత్రం మినహా కొత్త అవకాశం ఏదీ లేదు. దీంతో ఖాళీగా కూర్చొని చేతికందిందల్లా తినేసి ఎక్కడ బరువు పెరిగి పోతుందోనన్న భయంతో ఈ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ ఆహార విషయాల్లో నియమాలు పాటించాల్సిందిగా సమంతకు సూచించారట.
 
 అయితే పత్తు ఎండ్రదుకుళ్ చిత్ర షూటింగ్‌లో కాస్త గ్యాప్ రావడంతో అమ్మడు చెన్నైకి చెక్కేసిందట. ఇక్కడ ఇడ్లీ, సాంబారు, పొంగళ్, దోశ, వడ అంటూ ఆహారపు కట్టుబాట్లను పక్కన పెట్టి సుష్టిగా లాగించేస్తుందట. పైగా ఈ అల్పాహారానికి తాను బానిసనని, అందుకే చెన్నై వస్తే ఆహార నియమాలను పక్కనపెట్టి ఫుల్‌గా లాగించేస్తానని అంటోంది. త్వరలో నటనకు స్వస్తి చెప్పి సిద్ధార్థ్‌తో పెళ్లికి సిద్ధం అవుతున్నందు వల్లే ఈ అమ్మడు ఇలా ఆహార నియమాలకు నీళ్లొదిలిందనే వారు లేకపోలేదు. అయితే త్వరలోనే సమంత సిద్ధార్థ్‌తో కలిసి     ఒక చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోందన్న వార్త వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement