'రౌడీ' సంగీతం ఇళయరాజాకు అంకితం: వర్మ
'రౌడీ' చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ స్కోరును సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు అంకితం ఇస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. గతకొద్ది సంవత్సరాలుగా ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నానని.. ఆయనకు అభిమానినని వర్మ తెలిపారు. శివ చిత్రంలోని సైకిల్ ఛేజ్ థీమ్ ను తీసుకుని రౌడీ ప్రధాన థీమ్ ను రూపొందించాలని దర్శకుడు సాయి కార్తీక్ ను కోరానని...అయితే ఆ ఐడియా బ్రహ్మండంగా వర్కవుట్ అయిందని వర్మ తెలిపారు. రౌడీ బ్యాక్ గ్రౌండ్ థీమ్ ను 'సైకిల్ రౌడీ'గా పేర్కొన్నారు.
ఇళయరాజాకు అమితంగా అభిమానిస్తానని, ఆయనకు పెద్ద అభిమానినని, ఆయన శివ చిత్రానికి రూపొందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని వర్మ తెలిపారు. 1989లో శివ చిత్రంలో సైకిల్ ఛేజ్ కోసం ఇళయరాజా రూపొందించిన నేపథ్య సంగీతం ఇప్పటికి మర్చిపోలేనని ఆయన అన్నారు. ఇళయరాజాకు సెల్యూట్ అని వర్మ వ్యాఖ్యానించారు. వర్మ తొలి చిత్రం 'శివ'కు ఇళయరాజా సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.