R. Balki: Rajinikanth To Team Up With Ilayaraja For New Project - Sakshi
Sakshi News home page

Rajinikanth: కాంబినేషన్‌ కుదిరేనా?

Published Wed, Dec 22 2021 1:17 AM | Last Updated on Wed, Dec 22 2021 10:49 AM

Rajinikanth To Team Up With Ilayaraja For R. Balki New Project - Sakshi

‘అన్నాత్తే’  (తెలుగులో ‘పెద్దన్న’) రిలీజ్‌ తర్వాత రజనీకాంత్‌ హీరోగా నటించనున్న సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కార్తీక్‌ సుబ్బరాజు, వెంకట్‌ ప్రభు, కేఎస్‌ రవికుమార్‌ వంటి దర్శకులు రజనీకి కథలు వినిపించారని కోలీవుడ్‌ టాక్‌. తాజాగా ఈ జాబితాలో ‘చీనీ కమ్‌’, ‘పా’, ‘ప్యాడ్‌మాన్‌’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వíß ంచిన ఆర్‌. బాల్కీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట బాల్కీ. ఆ కథ రజనీకి బాగా నచ్చిందని సమాచారం.

ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలను కుంటున్నారట. ఇక ఇప్పటివరకూ బాల్కీ తెరకెక్కించిన వాటిలో చీనీ కమ్, పా, షమితాబ్‌ తదితర చిత్రాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఒకవేళ రజనీ – బాల్కీ కాంబినేషన్‌ కుదిరితే ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 1994లో వచ్చిన ‘వీర’ చిత్రం తర్వాత రజనీ–ఇళయరాజా కలిసి వర్క్‌ చేయలేదు. మరి... 28 ఏళ్ల  తర్వాత ఈ కాంబినేషన్‌ కుదురుతుందా? అసలు రజనీ–బాల్కీ కాంబినేషన్‌ కుదిరిందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement